పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ -కె కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో జాయిన్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్.
ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయ్యాలి డ్యూడ్ అంటూ మిర్చి మూవీలో మాస్ డైలాగ్ తో అలరించిన ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాడు. అందరినీ డార్లింగ్ అంటూ ఆప్యాయంగా పలకరించే ప్రభాస్ కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమాతో అలరించాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ నిర్మాణ దశలో ఉంది. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-కె సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ బయటికొచ్చింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో నటించనున్నట్లు చిత్రయూనిట్ ఖరారు చేసింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్-కెను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ నటిస్తున్నారు. వీరితో పాటు మరో ప్రముఖ హీరో నటిస్తున్నారంటూ వార్తలు చెక్కర్లు కొట్టాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ ప్రాజెక్ట్-కె చిత్ర యూనిట్ అఫీషియల్ అప్ డేట్ ఇచ్చింది. అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ ప్రాజెక్ట్-కె లో జాయిన్ కాబోతున్నాడంటూ ప్రకటించింది. కమల్ హాసన్ సినీ రంగానికి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు సంబంధించిన ప్రత్యేకమైన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
Welcoming the greatest actor Ulaganayagan @ikamalhaasan. Our journey becomes Universal now. #ProjectK https://t.co/DIbI5R7YA2#Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/pokTfuErl0
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 25, 2023