తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజులతో పాటు నటభూషణ శోభన్ బాబు కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నటుడిగానే కాక మంచి వ్యక్తిగానూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
సినిమా ఇండస్ట్రీలో తెరవెనుక జరిగే విషయాలు గమ్మత్తుగా ఉంటాయి. ముందుగా ఒక హీరోతో అనుకున్న సినిమా అనుకోని కారణాల వల్ల వేరే హీరో చేయాల్సి రావడం, రాత్రికి రాత్రే దర్శక నిర్మాతలు లేదా నటీనటులు, సాంకేతిక నిపుణులు వంటి వారు మారిపోవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఆ రోజుల్లో జరిగిన ఎవరికీ తెలియని సంఘటనల గురించి వచ్చే వార్తలంటే ప్రేక్షకులకెప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు నటభూషణ శోభన్ బాబు – విశ్వ నటుడు కమల్ హాసన్‌ల మధ్య చోటుచేసుకున్న ఊహించని పరిణామానికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. తాను చేయాల్సిన కథతో కమల్ సినిమా చేసి సంచలన విజయం సాధించడంతో శోభన్ బాబు షాక్ అయ్యారట. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజులతో పాటు శోభన్ బాబు కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నటుడిగానే కాక మంచి వ్యక్తిగానూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
భూమిని నమ్ముకుంటే నష్టపోమని నమ్మి చాలా చోట్ల స్థలాలు, పొలాలు కొన్నారు. ఆయన చెప్పిన మాటల స్ఫూర్తితోనే నటుడు మురళీ మోహన్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఎదిగారు. ఇక అప్పట్లో ఇద్దరు కథానాయికలు, కుటుంబ కథాచిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రెస్‌గా మారారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవారు. డేట్స్ ఖాళీ లేక చాలా చిత్రాలు వదులుకున్నారట. ఆయనకు కథలు కూడా ఒక పట్టాన నచ్చేవి కావట. వాటిలో మొదట వద్దనుకుని, తర్వాత ఫీల్ అయిన సినిమా ‘ఆకలిరాజ్యం’. కమల్ హీరోగా దర్శక దిగ్గజం కె.బాల చందర్ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రమిది. అయితే మొదట శోభన్ బాబుని కథానాయకుడిగా అనుకున్నారు. కథ రెడీ అయింది. రెండు, మూడు సిట్టింగ్స్ కూడా జరిగాయి. కట్ చేస్తే శోభన్ బాబుకి ముందునుండీ హీరో పాత్ర విషయంలో కొన్ని సందేహాలున్నాయి. కొన్ని మార్పులు చేర్పులు చెప్పారు. కానీ దర్శకుడు ఒప్పుకోలేదు.
జీవితంలో రాజీ పడని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద, నిరుద్యోగ యువకుడిగా కనిపించే హీరో, అతనికి ఎదురయ్యే సమస్యలు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ బాగానే ఉన్నా.. కథానాయకుడు ఎమ్ఏ ఫిలాసఫీ చదివి సెలూన్‌లో పనిచేయడం అనేది శోభన్ బాబుకి నచ్చలేదు. అతను చేయడానికి ఇంకే పనులు లేవా? మార్చండి అని చెప్తే.. దానికి ససేమిరా అన్న దర్శకుడు కథలో హీరో వృత్తికి బదులు హీరో పాత్రధారినే మార్చేశారు. దీంతో శోభన్ బాబు స్థానంలో కమల్ హాసన్‌ని తీసుకున్నారు. విడుదలైన తర్వాత ఊహించిన దానికంటే ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. పాటలైతే మార్మోగిపోయాయి. 100 రోజుల వేడుకకు శోభన్ బాబుని ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి స్వయంగా కమల్ ఆయన ఇంటికి వెళ్లారట. సినిమా ఇంత బాగా వస్తుందని తాను ఊహించలేదని.. అద్భుతంగా నటించావంటూ కమల్‌ని హత్తుకుని, భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారట. అలాగే ‘ఆకలిరాజ్యం’ వంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని వదులుకున్నందుకు చాలా బాధపడ్డారట శోభన్ బాబు.