రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాల కంటే అతడి యాటిట్యూడ్ కే ఎక్కువమంది ఫ్యాన్స్. ముఖ్యంగా చెప్పాలంటే లేడీ అభిమానులు. ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ టైమ్ లో మనోడు ఇచ్చిన స్పీచ్ విని ఫుల్ ఫిదా అయిపోయారు. రౌడీ హీరోకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయిపోయారు. ఇది తెలుగు వరకు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఉత్తరాదిలోనూ విజయ్ కి లక్షలాది మంది అభిమానులు ఏర్పడ్డారు. అది కూడా అక్కడ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే.. అలాంటి విజయ్ కి ‘లైగర్’ భారీ దెబ్బ కొట్టింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మిగతా యంగ్ హీరోలతో పోల్చితే విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్. అది ఇప్పుడు ప్లస్ కావొచ్చేమో కానీ భవిష్యత్తులో అదే మైనస్ కూడా అయ్యే అవకాశముంది. ఎందుకంటే విజయ్ యాటిట్యూడ్ ని ఇష్టపడే వాళ్లు చాలామంది ఉంటారు. ఒకవేళ విజయ్ చేస్తున్న సినిమాల్లో ఏదైనా తేడా కొట్టేస్తే వాళ్లే మళ్లీ ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ‘లైగర్’ విషయంలో సేమ్ అదే జరిగింది. భారీ అంచనాలతో ఆగస్టు 25న పాన్ ఇండియా రేంజ్ లో ‘లైగర్’ విడుదలైంది. అంతకుముందు ప్రమోషన్స్ లో భాగంగా దేశం మొత్తం తిరిగిన విజయ్.. స్పీచులతో కొన్ని కాంట్రవర్సీల్లోనూ చిక్కుకున్నాడు.
అంతా బాగా జరిగి సినిమా హిట్ అయ్యుంటే వీటిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ‘లైగర్’ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవడంతో విజయ్ పై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. చివరికి ‘జబర్దస్త్’లో కూడా అది తప్పలేదు. తాజా ఎపిసోడ్ లో బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో విజయ్ ని ఇమిటేట్ చేస్తూ ఓ డైలాగ్ చెప్పాడు. ‘అరేయ్ ఏందీరా క్రేజ్.. మా తాత తెల్వదు, మా నాన్న తెల్వదు, ఎవ్వడు తెల్వదు.. అయినా ఇంత ప్రేమ చూపిస్తున్నారు’ అని భాస్కర్ డైలాగ్ చెప్పాడు. ఇది చూసిన నెటిజన్స్ తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. మరి విజయ్ పై ‘జబర్దస్త్’లోనూ వచ్చిన ట్రోలింగ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: లైగర్ రిజల్ట్.. భారీ మొత్తం వెనక్కి ఇచ్చేసిన విజయ్!
ఇదీ చదవండి: హీరో విజయ్ ని టార్గెట్ చేసిన తెలుగు మీమర్స్! కారణం?