సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కితే.. తాజాగా ఓ ప్రముఖ సీరియల్ నటుడు 50 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ళ సీజన్ నడుస్తోంది. వరుసగా సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే స్వర భాస్కర్, కియారా అద్వానీ, అతియా శెట్టి లాంటి సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ జాబితాలోకే చేరాడు ఓ ప్రముఖ సీరియల్ నటుడు. అయితే ఆ నటుడికి ఇది రెండో పెళ్లి కాగా అతడి వయసు 50 సంవత్సరాలు. బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
సచిన్ ష్రాఫ్.. ప్రముఖ హిందీ సీరియల్ అయిన ‘తారక్ మెహతాకా ఉల్టా చష్మా’ తో బుల్లితెరపై నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంటీరియర్ డిజైనర్ అయిన చాందినిని ఫిబ్రవరి 25న వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితులు, బంధు మిత్రుల మధ్య వీరి వివాహ వేడుకు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ బుల్లితెర నటులు సందడి చేసి.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సచిన్ ష్రాఫ్ కు ఇది రెండవ మ్యారేజ్. 2009లో జుహి పార్మర్ ను పెళ్లి చేసున్న అతడు.. 2018లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం సచిన్ ష్రాఫ్-చాందినిలా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.