భువనేష్..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రత్యేకంగా వినిపిస్తున్న పేరు. ‘సూపర్ సింగర్ జూనియర్’ షోలో మూడవ స్థానంలో నిలిచి అందరిని ఆకట్టుకున్నాడు. అతడిని ఎన్నిసార్లైన శభాష్ భువనేష్ అని మెచ్చుకోవచ్చు. ఒకే గొంతుపై ఎంతో మంది గాయకులను తీసుక వస్తూ తీయని పాటలు వినిపిస్తాడు. జటిలమైన శ్లోకాలను అలవోకగా వల్లిస్తుంటాడు. వాయిద్యాలతోనే కాదు నోటితోను సంగీతాన్ని పలికించకలిగిన నేర్పరి. మిమిక్రీ చేస్తూ అందరని నవ్విస్తుంటాడు. ఇన్ని ప్రతిభలు ఉన్న భువేషన్ కి ఎన్నిసార్లు శభాష్ అని చెప్పిన తక్కువే. అయితే భువనేషన్ అందరి లాంటి సామాన్య వ్యక్తి కాదు.. చిన్నతన నుంచి చూపు లేదు. అయితే వైకల్యం అనేది శరీరానికి తప్ప మనస్సుకు కాదని బలంగా నమ్మిన భువనేషన్ పట్టుదలతో కష్టపడి సంగీతం ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం సంపాదించాడు. అయితే భువనేష్ కంటి చూపు చికిత్స విషయం గురించి.. అతడి తల్లిదండ్రులు ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ బిడ్డ కంటి చూపు చికిత్సకు తాను సాయం చేస్తానని సుధీర్ చెప్పినట్లు భువనేష్ తల్లిదండ్రులు తెలిపారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం నుంచి హైదరాబాద్ కు వచ్చి.. తన గాత్రంతో సామాన్య ప్రేక్షకుల నుంచి సంగీత ఉద్దండుల వరకు ఎంతో మంది ప్రశంసలు అందుకున్నాడు. సూపర్ సింగర్ జూనియర్ షోలో భువనేష్ మూడవ స్థానం నిలిచాడు. అతడు సాధారణ స్థితి నుంచి ఈ స్థాయికి రావడానికి ఎంతో కృషి చేశాడు. విజయనగరంలోని ద్వారకామాయి అంధుల పాఠశాల విద్యార్ధి ఆయినే భువనేష్.. పాఠాలైనా,పాటలైన బ్రెయిల్ లిపిలో రాసుకుంటాడు. సంగీతంలో ఎన్నో కష్టతరమైన పదాలు ఉంటాయి. కానీ అవేమీ భువన్ కి కష్టంగా అనిపించలేదు. అమ్మనాన్నలకు సంగీతం తెలియదు. తనకు సంగీతం నేర్పించే గురువు అంటూ లేరు. అతడే యూట్యూబ్ నే గురువుగా చేసుకుని రకరకాల జానర్స్ లో పాటలు నేర్చుసుకున్నాడు.
ఇలా కష్టపడి సామాన్య స్థితి నుంచి ఇప్పుడు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాందించాడు. తనదైన విశేష ప్రతిభతో అందరిని ఆకట్టుకున్నాడు. మరి..ముఖ్యం గా సూపర్ సింగర్ జూనియర్ లోని సెలబ్రిటీలు భువనేష్ గాత్రానికి ఫిదా అయ్యారు. ఈక్రమంలోనే సుడిగాలి సుధీర్ భువన్ తల్లిదండ్రులకు ఓ మాట ఇచ్చాడంట. భువన్ కంటికి చికిత్సకు అవసమైన సాయం తాను చేస్తానని సుధీర్ తెలిపాడంట. ఇక భువన్ తల్లిదండ్రులో మాట్లాడుతూ.. “చిన్నతనంలో భువన్ కి కంటి చూపురాదని వైద్యలు చెప్పారు. పెద్దైన తరువాత ఇటీవల ఒకసారి వైద్యులకు చూపిస్తే.. చికిత్స చేయవచ్చు అని తెలిపారు. ఆ విషయం తెలిసిన సుధీర్.. ఆ చికిత్సకు తాను సాయం చేస్తానని చెప్పారు. అయితే బాబు ఆపరేషన్ సక్సెస్ అయ్యే వరకు చెప్పొద్దన్నారు. బాబుకు చూపు వచ్చిన తరువాత ప్రెస్ మీట్ పెట్టి తెలియజేద్దామని అన్నారు” అని భువనేష్ తల్లిదండ్రులు తెలిపారు.