బిగ్ బాస్ ఐదో సీజన్ లో షన్ను-సిరి ఎంతలా రెచ్చిపోయారు తెలిసిందే. ఆ విషయం జనాలు దాదాపు మర్చిపోయారు. సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా ఆమెని అర్థం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు మరోసారి ఆ టాపిక్ డిస్కషన్ లోకి వచ్చింది.
షార్ట్ ఫిల్మ్స్, బిగ్ బాస్ చూసేవాళ్లకు శ్రీహాన్-సిరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరూ వరసగా రెండు సీజన్స్ లో పాల్గొన్నారు. ఫైనల్స్ వరకు వచ్చారు. అయితే సిరితో పాటు అదే సీజన్ లో ప్రముఖ యూట్యూబ్ షణ్ముక్ జస్వంత్ కూడా వచ్చాడు. వీరిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉండటం వల్ల కాస్త కలిసి ఉండేవారు. తర్వాత తర్వాత మాత్రం అది శ్రుతిమించిపోయింది. హగ్గులు, కిస్సులు, ప్రేమ, కోపం, అలకలు.. ఇలా లవర్స్ మధ్య ఏమేం ఉంటాయో అన్ని చూపించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బిగ్ బాస్ షోలో అడుగుపెట్టే టైంకి షన్ను, దీప్తి సునైనాతో లవ్ లో ఉన్నాడు. సిరి, శ్రీహాన్ తో రిలేషన్ లో ఉంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అయితే ఆ సీజన్ షన్ను-సిరి చేసిన వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అయింది. వాళ్లపై నెగిటివిటీ కూడా బాగా పెరిగిపోయింది. అందుకే ఐదో సీజన్ లో షన్ను గెలుస్తాడని చాలామంది అనుకున్నారు. సిరితో చేసిన పనులు, వచ్చిన నెగిటివిటీ కారణంగా రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. సీజన్ పూర్తయిన తర్వాత కొన్నాళ్లకు షన్నుకు దీప్తి బ్రేకప్ చెప్పేసింది. వాళ్లిద్దరూ విడిపోయారు. ఇక సిరి-శ్రీహాన్ రిలేషన్ లోనూ మనస్పర్థలు వచ్చాయని అప్పట్లో టాక్ వినిపించింది. కానీ కొన్నాళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసిపోయారు. షోల్లో, బయట తెగ సందడి చేశారు.
గతేడాది ‘బిగ్ బాస్ 6’లో శ్రీహాన్.. రన్నరప్ అయ్యాడు. ఈ సీజన్ మొత్తంలో అతడికి సపోర్ట్ చేస్తూ సిరి అండగా నిలబడింది. ఇక వాలంటైన్స్ డే సందర్భంగా స్టార్ మాలో ఈ ఆదివారం.. ‘లవ్ టుడే- రీల్ vs రియల్’ పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది. దీని ఫుల్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. అందులో సిరి, బిగ్ బాస్ లో షణ్ముక్ తో క్లోజ్ గా ఉన్న విషయాల్ని ఒప్పేసుకుంది. తనని శ్రీహాన్ అర్థం చేసుకున్న తీరు గురించి చెప్పుకొచ్చింది. స్టేజీపైనా ఈ జోడీ ఫుల్ రొమాన్స్ పండించింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ వీళ్లిద్దరి మధ్య క్లియర్ అయిపోయిన విషయాన్ని మళ్లీ ఇప్పుడు షో కోసం మరోసారి బయటపెట్టుకోవడం ఏం బాలేదని నెటిజన్స్ మండిపడుతున్నారు. మరి సిరి వ్యాఖ్యలపై మీరేం అంటారు. కింద కామంట్స్ లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి.