పేరుకే అది ‘జబర్దస్త్’ షో కానీ.. అందులో కామెడీతో పాటు ఎన్నెన్నో ఉంటాయి. ముఖ్యంగా జోడీల సంఖ్య ఎక్కువే. వాళ్ల మధ్య కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ లెవల్ ఉంటుంది. వాళ్ల మధ్య ఉన్నది నిజమైనా ప్రేమ లేదా షో కోసం అలా చేస్తున్నారా అనేది అస్సలు అర్థం కాదు. సుధీర్-రష్మీ జంటతో మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొత్త కొత్త జంటలు రోజురోజుకీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ఆ జోడీలు.. షోలో చేసే కొన్ని పనులు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది!
ఇక విషయానికొస్తే.. 2013లో ‘జబర్దస్త్’ స్టార్ట్ అయినప్పుడు ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కానీ కొన్నినెలల టైంలోనే కామెడీ షో సూపర్ సక్సెస్ అయింది. ఎంతోమంది సాదాసీదా హాస్యనటుల్ని స్టార్స్ ని చేసింది. వారిలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను లాంటి వాళ్లు ఉన్నారు. అయితే షోలో చేసే కామెడీతో పాటు జంటలుగా కెమిస్ట్రీ కూడా భలే పండిస్తుంటారు. యాంకర్ రష్మీతో సుధీర్ వర్కౌట్ చేసిన కెమిస్ట్రీ కొన్నేళ్ల పాటు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. ఆ తర్వాత సుధీర్.. షో నుంచి తప్పుకోవడంతో కొత్త జోడీలు చాలానే పుట్టుకొచ్చాయి.
ఇక ఆ జంటల్లో రాకేష్-సుజాత కూడా ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి ‘జబర్దస్త్’ షోలో చేస్తున్న రాకేష్.. ప్రస్తుతం టీమ్ లీడర్ గా స్కిట్స్ చేస్తున్నాడు. మరోవైపు న్యూస్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుజాత.. ‘జోర్దార్’ సుజాతగా పేరు సంపాదించింది. ‘బిగ్ బాస్’ షోలోనూ పాల్గొని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆడపాదడపా షోల్లో కనిపించిన ఈమె.. తన యూట్యూబ్ వ్లాగ్స్ లో ఎక్కువగా రాకేష్ తో కనిపించింది. వీళ్లిద్దరిపై ఎవరికీ డౌట్ రాలేదు కానీ కొన్నాళ్ల ముందు నుంచి మాత్రం షోలోనే కాకుండా బయట కూడా జోడీగా కనిపిస్తూ వచ్చారు. ఇక కొన్ని రోజుల ముందు సుజాత బర్త్ డే కోసం ఇద్దరూ కలిసి దుబాయి వెళ్లారు. అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు.
రాకేష్-సుజాత రిలేషన్ గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు షోలో భాగంగా స్టేజీపై స్కిట్ అయిపోయిన తర్వాత రాకేష్ రింగ్ తో సుజాతకు ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ షాకైన ఆమె.. ఆ తర్వాత అతడిని దగ్గరకు తీసుకుంది. ఈ క్రమంలోనే సుజాత నుదుటిపై రాకేష్ ముద్దు కూడా పెట్టాడు. ఈ మొత్తం.. తాజాగా రిలీజ్ చేసిన ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ప్రోమోలో కనిపించింది. అయితే రాకేష్ నిజంగానే ప్రపోజ్ చేశాడా? లేదా స్కిట్ లో భాగంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. మరి స్టేజీపై ప్రపోజ్, ముద్దు పెట్టుకోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.