తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు అనేక సీరియల్స్ ప్రసారమవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే ప్రజాదరణ పొందుతాయి. అలాంటి వాటిల్లో ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ఒకటి. ఈ సీరియల్ పై మొదట్లో ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉండేది. అందులో తులసిగా నటించిన కస్తూరి శంకర్ నటనకు అందరు ఫిదా అయ్యారు. ఓ సాధారణ గృహిణిని భర్త పెట్టే ఇబ్బందులను, ఆమె ఎంతో ఓపికతో భరిస్తూ రావడం ఎంతో చక్కగా చూపించారు. దీంతో ఈ సీరియల్ కు ఆడియన్స్ లో.. మరి ముఖ్యంగా మహిళలో మంచి ఆదరణ లభించింది. అయితే ఇటీవల కొంతకాలం నుంచి ప్రసారమవుతున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ఎపిసోడ్స్ పై చాలా మంది నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. అనవసరపు ట్రాక్ లు పెట్టి సీరియల్ ను చెడగొడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తోన్నాయి.
‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ లో తులసి అనే ఓ సాధారణ గృహిణి పాత్రలో కస్తూరి శంకర్ నటిస్తూ అందరి ప్రశంసలు పొందుతుంది. ఆమెను తన భర్త నందు, లాస్య అనే మరో మహిళ కలసి పెట్టిన ఇబ్బందులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది. తన కళ్ల ముందే మరో మహిళతో తన భర్త చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నా.. ఎంతో ఓర్పుతో తులసి ప్రవర్తించింది. పిల్లలు కూడా తులసి సపోర్టుగా ఉండేవారు. ఇలా సాగుతున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణ పొందింది. టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్న సీరియల్స్ లో ఒకటిగా ‘ఇంటింటి గృహలక్ష్మి’ నిలిచింది. బుల్లితెర ఆడియన్స్ లో ఈ సీరియల్ పై మంచి పాజిటీవ్ టాక్ ఉంది. అయితే ఇటీవల ఈ సీరియలోకి సామాట్ర్ ను కొత్తగా తీసుకొచ్చారు.
తులసి, సామ్రాట్ ల మధ్య సన్నివేశాలు తీశారు. ఓ యువకుడితో సాధారణ గృహిణిగా ఉన్న తులసితో కొన్ని రకాల సీన్లు పండిచేలా తీయడం బాగాలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీరియల్ పై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ కూడా తెగ వస్తున్నాయి. ఇటీవల కొన్ని రోజులగా వస్తున్న గృహలక్ష్మి సీరియల్ ఎపిసొడ్స్ బాగాలేవని, తులసిని మరో రకం చూపించడం సరైనది కాదని కొందరు అంటున్నారు. తాజాగా ప్రసారమైన ఓ ఎపిసోడ్ చూసినట్లు అయితే అనుకోని పరిస్థితుల్లో సామ్రాట్, తులసి.. ఇద్దరే ఓ ఇంట్లో ఉండిపోతారు. అంతే కాక రాత్రి అంతా ఓకే గదిలో నిద్రపోయారు. దీంతో తులసి ఇంట్లో వాళ్లకి ఆమెపై అనేక అనుమానాలు కలుగుతాయి.
ఇలా ఓ చక్కటి గృహిణికి ఓ యువకుడు మధ్య సన్నివేశాలను తీయడంతో సీరియల్ పై నెగిటీవ్ టాక్ వస్తుందని తెలుస్తోంది. గతంలో ఎంతో చక్కగా తీసిన ఈ సీరియల్ లో ఇప్పుడు ఎందుకో చెడు ఉద్దేశ్యం కలిగించే సన్నివేశాలను తీస్తున్నారని కొందరు బుల్లితెర ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఎపిసోడ్ లతో ఇటీవల ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ కు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గిందని మరికొందరు అంటున్నారు. మరి.. మంచి సాగుతున్న సీరియల్ ను అనవసరపు ట్రాక్ పెట్టి చెడగొడుతున్నారు. మరి.. ఏమోతుందో ముందు ముందు చూడాలి.