ఈ మధ్యకాలంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు బుల్లితెరపై ఎన్నో కొత్త కార్యక్రమాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే కొన్నేళ్లుగా జబర్దస్త్, ఎక్ట్రా జబర్దస్త్ కామెడీ షోలతో పాటు.. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ స్టార్స్ లాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జీ తెలుగులో ‘మనవూరి రంగస్థలం’ పేరిట ఓ కొత్త షో ప్రారంభం అవుతోంది. ప్రతి ఆదివారం ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.
ఈ చిన్న ప్రోమోలో కమెడియన్ చమ్మక్ చంద్ర గురించి ఎమోషనల్ గా చూపించారు. చమ్మక్ చంద్ర లేడీ గెటప్ లో డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. అలాగే హీరో సుధీర్ కలిసి స్టేజిపై స్టెప్స్ వేశాడు. ఆ తర్వాత చమ్మక్ చంద్ర ద్వారా జబర్దస్త్ లో ఫేమస్ అయిన కమెడియన్ రచ్చ రవి స్టేజిపై.. ‘నాకు చంద్రన్న అవకాశం ఇవ్వకుంటే ఈరోజు ఇక్కడ ఉండేవాణ్ణి కాదుకదా..’ అని చంద్ర కాళ్లపై పడిపోయాడు. అనంతరం చంద్ర మాట్లాడుతూ.. ‘తాను ఇండస్ట్రీకి వద్దామని అనుకున్నప్పుడు 1500 ఇచ్చి పంపించారని’ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.