అషురెడ్డి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. ఈ బ్యూటీ మొదట డబ్‌స్మాష్ వీడియోలు చేసి గుర్తింపు సంపాందించింది. అనంతరం బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది ఈ అందాల ముద్దుగుమ్మ. జూనియర్ సమంతగా అని అషుబేబిని పిలుస్తుంటారు. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను బోల్డ్ ఇంటర్వూ చేశాక అషు రెడ్డి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలోనూ అషూ రెడ్డి చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలతో పాటు, హాట్ ఫోటోలను, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా పల్సర్ బైక్ పాటకు డ్యాన్స్ చేసి మరోసారి కుర్రకారును ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల గాజువాక ఆర్టీసీ బస్ కండక్టర్ ఝాన్సీ చేసిన పల్సర్ బైక్ సాంగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. ఈ సాంగ్ తో ఝాన్సీ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఏ కార్యక్రమంలో చూసిన ఈ సాంగ్ వినిపిస్తోంది. అంతేకాక అందరూ ఈ పల్సర్ బైక్ పాటకు చిందులేసి సందడి చేస్తున్నారు. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు, సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఈ పల్సర్ బైక్ సాంగ్ కి డ్యాన్స్ చేసి.. తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి సైతం ఈ పాటకు డ్యాన్స్ చేసింది. మాములుగానే మాస్ ప్రేక్షకులను ఈ పాట అమితంగా ఆకట్టుకుంది. మరి ఇక అషూ రెడ్డి డ్యాన్స్ చేస్తే ఇంకేలా ఉంటుంది చెప్పండి. అషు రెడ్డి అందాలకు తో ఈ మాస్ సాంగ్ జతకావడంతో డ్యాన్స్ వేరేలెవల్ కి వెళ్లింది.
అషు రెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను షేర్ చేసింది. గతంలో పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ’ పాటకు అషూ రెడ్డి డ్యాన్స్ చేసి కుర్రకారుకు చెమటలు పట్టించింది. మరోసారి పల్సర్ బైక్ వీడియోతో సోషల్ మీడియాలో ఈ అమ్మడు రచ్చ రచ్చ చేసింది. మరి..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అషు బేబి పల్సర్ బైక్ డ్యాన్స్ పై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.