పోసాని కృష్ణ మురళి.. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని పొందాడు. రచయితగా, డైరెక్టర్ గా, నటుడిగా టాలీవుడ్ లో తనదైన ముద్రను వేశాడు పోసాని. ఆయన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవిని కూడా అప్పగించిన సంగతి మనకు తెలిసిందే. ఇక పోసాని ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే పలు షోలకు జడ్జిగా, అతిధులుగా హాజరౌతున్నారు. పోసాని కృష్ణ మురళి ఎక్కడుంటే.. అక్కడు హుషారు ఖాయం. పోసాని వేసే పంచులకు, చెప్పే మాటలకు అంతెందుకు అతడు ‘బంగార్రాజా’ అంటెనే మనకు నవ్వాగదు. అలాంటి పోసాని జీవితంలో ఉన్న విషాదం తెలిస్తే కళ్లు చెమర్చక మానవు. తాజాగా ‘సుమ అడ్డ’ షోలో అలీతో పాటుగా పాల్గొన్నారు పోసాని. ఈ క్రమంలోనే తన తండ్రి మరణాన్ని తలచుకుని భావోద్వేగానికి గురైయ్యారు.
తెలుగు తెరపై విలక్షణ నటన పండించే కొంత మంది నటులలో పోసాని కృష్ణ మురళి ఒకరు. నటుడిగానే కాకుండా తనలో ఉన్న రచయిత, డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక పోసాని ఎక్కడుంటే అక్కడ నవ్వులు పండుతాయి. అంత హుషారుగా ఉండే పోసాని తన జీవితంలో ఉన్న విషాదం గురించి తాజాగా బయటపెట్టాడు. స్టార్ యాంకర్ సుమ హోస్ట్ గా లేటెస్ట్ గా స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ సుమ అడ్డ. తాజాగా ఫిబ్రవరి 4 ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్ కు అతిథులుగా ప్రముఖ కమెడియన్ అలీ, పోసాని కృష్ణ మురళిలు హాజరైయ్యారు. ఇక ఎప్పటిలాగే తమదైన హాస్యాన్ని పండించారు పోసాని, అలీలు. ఈ షోలో సుమ తండ్రి గురించి ప్రశ్నలు అడగ్గా.. భావోద్వేగానికి గురైయ్యారు పోసాని.
“మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. మాకు బతకడం నేర్పించారు. ఆయనకు ఏ అలవాటు లేదు. కానీ ఎవరో పేకాట నేర్పారు. అదే మా జీవితాల్ని అగాథంలోకి నెట్టేసింది. చాలా మంది మా నాన్నని ఎందుకు సుబ్బారావు ఇలా చేస్తున్నావ్ అని అడిగారు. దాంతో మనస్థాపానికి గురై.. పొలం దగ్గరికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు” అని చెప్పుకుంటూ.. భావోద్వేగానికి లోనైయ్యారు పోసాని. ఎప్పుడు నవ్విస్తు ఉండే పోసాని ఒక్కసారిగా అలా కావడంతో సుమ, అలీలు కూడా భావోద్వేగం చెందారు. ప్రస్తుతం పోసాని తండ్రిని తలచుకుని భావోద్వేగానికి గురైన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి తన తండ్రిపై ఉన్న ప్రేమను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనైన పోసానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.