‘జబర్దస్త్’ షో ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు. సుడిగాలి సుధీర్ దగ్గర నుంచి హైపర్ ఆది వరకు ప్రస్తుతం చాలామంది టీవీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. వీళ్లతో పాటు పలువురు కమెడియన్స్ కూడా షోలు చేస్తూ, సినిమాల్లో నటిస్తూ ఫేమ్ సంపాదించుకుంటున్నారు. అలాంటివారిలో ముక్కు అవినాష్ ఒకడు. ఈ కమెడియన్ గురించి టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన మనోడు.. ఆ తర్వాత ‘జబర్దస్త్’ షోతో కమెడియన్ అయిపోయాడు. ఆ తర్వాత కెవ్వు కార్తిక్ తో కలిసి టీమ్ లీడర్ గానూ పలు స్కిట్లు చేశాడు. వీక్షకుల్ని ఎంతగానే అలరిస్తూ వచ్చాడు.
ఇక బిగ్ బాస్ లో పాల్గొనే ఛాన్స్ రావడంతో.. ‘జబర్దస్త్’ పూర్తిగా మానేశాడు. 4వ సీజన్ వన్ ఆఫ్ ది ఎంటర్ టైనర్ గా నిలిచి ఫైనల్ వరకు వచ్చాడు. కానీ విజేతగా నిలవలేకపోయాడు. ఇక బిగ్ బాస్ పూర్తయిన తర్వాత తిరిగి అదే ఛానెల్లో కామెడీ స్టార్స్ అనే కామెడీ షోలో టీమ్ లీడర్ గా చేస్తూ వస్తున్నాడు.దీనితోపాటే స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ తనకున్న గుర్తింపుని ఇంకాస్త పెంచుకున్నాడు. మరోవైపు సినిమాల్లోనూ చిన్న చిన్న రోల్స్ లో నటిస్తున్నాడు.. యూట్యూబ్ లోనూ వీడియోలు చేస్తూ, నెటిజన్స్ కి ఎప్పుడూ దగ్గరగానే ఉంటున్నారు.
ఇక అవినాష్.. తాజాగా తన బర్త్ డే వేడుకల్ని జరుపుకొన్నాడు. ఈ ఈవెంట్ కి సినీ రచయిత కోన వెంకట్ తోపాటు చమ్మక్ చంద్ర, సద్దాం, సత్యశ్రీ, ప్రియాంక సింగ్, యాదమ్మ రాజు తదితరులు వచ్చి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని అవినాష్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో పెద్ద కేక్ కోస్తూ మనోడు కనిపించాడు. ఇక సద్దాం టీమ్ అంతా కలిసి అవినాష్ కి ఓ ఫొటోని బహుమతిగా ఇచ్చారు. మరి అవినాష్ బర్త్ డే వేడుకలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: నాగబాబుపై ముక్కు అవినాష్ ! స్టేజ్ పైనే ఆలా అనేశాడు !