మహేశ్ బాబు.. కృష్ణా కుమారుడిగా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు టాలీవుడ్లోనే అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగాడు. అగ్రహీరో కుమారుడిగా కాకుండా తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. పాన్ ఇండియా లెవల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో టాప్ కంపెనీలు మహేశ్‌ను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలంటూ కోరుకుంటాయి.
వెండితెరపైనే కాదు అటు రియల్ లైవ్‌లోనూ మహేశ్ ఓ సూపర్ స్టార్ అని అందరికీ తెలుసు. ఎన్నో సేవా కార్యక్రమాలు చెపడుతూ ప్రజలకు తనవంతు సహాయం చేస్తుంటారు. అటు చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ వందల కుటుంబాల్లో చిరునవ్వులు పూయిస్తున్నారు. ఇప్పుడు మహేశ్ బాబు రియల్ లైఫ్ హీరో మరోసారి నిరూపించుకున్నారు.
మహేశ్ బాబు తన కుమార్తెతో కలిసి డాన్స్ ఇండియా డాన్స్ అనే కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రోమోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బాబు, కుమార్ అనే ఇద్దరు డాన్సర్ల టాలెంట్ చూసి మహేశ్ మోస్మరైజ్ అయిపోయాడు. వారిని పొగడ్తలతో ముంచెత్తాడు.
అలా మాటలతో సరిపెట్టకుండా వారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తాను చేసే సినిమా గానీ తన సినిమాలో గానీ వారికి అవకాశం ఇస్తానంటూ స్టేజ్ పైనే హామీ ఇచ్చాడు. మహేశ్ ఇచ్చిన ఆఫర్ కు బాబు, కుమార్‌కు కాసేపు ఏం అర్థంకాలేదు. తేరుకుని పరుగున వెళ్లి మహేశ్ కాళ్లపై పడిపోయారు. వారిని లేపి మహేశ్ హత్తుకున్నాడు. మహేశ్ బాబు వ్యక్తిత్వంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.