‘బంగారం.. చాలామంది అడుగుతున్నారు.. నీ బంగారం ఎవరని.. ఏమని సమాధానం చెప్పను. నువ్వు దూరమయ్యావని చెప్పనా.. నువ్వు నా దగ్గరే ఉన్నావని చెప్పనా.. ఛీ పోరా’.. సోషల్ మీడియా ఇప్పుడు ఇవే డైలాగులు రీసౌండింగ్ వస్తున్నాయి. అంతేకాదు ‘బంగారం.. ఆ చెప్పు’ అంటూ డీజేలు, రీమిక్సింగ్లతో మోత మోగిస్తున్నారు. ఈ ఒక్క రీల్‌తో ఆమె ఒక సెలబ్రిటీ అయిపోయింది. ఎక్కడ చూసిన ఆమె గురించే చర్చ. సెలబ్రిటీలు సైతం ఆమె మాటలతో రీల్స్ చేస్తున్నారు. జబర్దస్త్ లాంటి షోలో చలాకీ చంటి టీమ్‌లో ఆమె స్కిట్ కూడా చేసింది. అయితే తన మాటలతో అందరినీ ఇంతలా నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తున్న ఆమె జీవితంలో జీవితంలో అంతులేని కష్టాలు ఉన్నాయి. ఆమె కన్నీటి గాథ విన్న వారంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ బంగారం ఫేమ్ మరెవరో కాదు.. నెల్లూరు జిల్లాకు చెందిన శాంతి అనే యువతి. తల్లితో కలసి సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చిన శాంతి తన జీవితంలోని కష్టాలు, తాము పడ్డ బాధల గురించి చెప్పుకొచ్చింది. శాంతి తల్లికి 18 ఏళ్ల వయసులోనే 40 ఏళ్ల వ్యక్తితో వివాహం చేశారు. శాంతికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. వాళ్ల తండ్రి వీళ్లకు ఊహ తెలిసే సమయానికే మతిమరుపుతో వీళ్లందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. View this post on Instagram A post shared by shanti_ actor's (@pspk_fan_comedy_star_shanti) ఇప్పటికీ తండ్రి కోసం వీళ్లు వెతకని రోజు లేదు. ప్రతి గ్రామంలో తండ్రి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇద్దరి పిల్లలతో ఓ ఆడది జీవించడం అంటే అంత తేలిక కాదని అందరికీ తెలుసు. ఇరుగు పొరుగు వారే కాదు.. బంధువులు సైతం సూటిపోటి మాటలతో ఆమెను వేధించారు. అంతేకాకుండా ఆమే.. భర్తను హత్య చేసిందంటూ ఆరోపణలు చేసినట్లు వాపోయారు. తన కళ్ల ముందే తల్లిని దారుణంగా కొడుతుంటే ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయానంటూ శాంతి ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా చిన్న వయసులోనే ఆటో తోలుతూ.. వాటర్ క్యాన్లు మోస్తూ తమ్ముడు కుటుంబాన్ని పోషించేవాడని చెప్పుకొచ్చింది. ఇంట్లో ఒక్కదాన్నే వదిలిపెట్టే ధైర్యం లేక తల్లి శాంతిని హాస్టల్ ఉంచి పెచింది. పదో తరగతి వరకూ చదువుకున్న శాంతి ఆ తర్వాత ఏదొక పని చేస్తూ కాలం వెళ్ల దీసింది. శాంతికి యాక్టింగ్ అంటే బాగా ఇష్టం. అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. View this post on Instagram A post shared by shanti_ actor's (@pspk_fan_comedy_star_shanti) అయితే ఎప్పుడూ రొటీన్‌గా వీడియోలు ఎందుకు చేయాలి అని ఒకసారి తన సొంత మాటలతో రీల్ చేసింది. బంగారం అనే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసిన శాంతి ఆ తర్వాత సోషల్ మీడియా, మీమర్స్ వల్ల ఎంత ఫేమస్ అయ్యిందంటే.. జబర్దస్త్ వాళ్లే ఆమెను పిలిచి అవకాశం కల్పించారు. యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టమంటున్న శాంతి.. ఒక్క ఛాన్స్ ఇస్తే తానేంటే నిరూపించుకుంటానంటూ రిక్వెస్ట్ చేస్తోంది. ఎన్ని కష్టాలు, అపవాదులు ఎదురైనా తమని తల్లి ఎంతో కష్టపడి పెంచిందని తెలియజేసింది. అలాంటి తల్లికి ఒక ఇల్లు కట్టి గిఫ్ట్ ఇవ్వాలన్నదే తన కల అని చెబుతోంది. ఎప్పిటికైనా జీవితంలో ఉన్నతంగా ఎదిగి.. బాగా సంపాదించి తన కుటుంబానికి అండగా నిలవాలన్నదే తన కోరిక అంటూ శాంతి చెబుతోంది. ఒక్క అవకాశం ఇస్తే తనలోని టాలెంట్ నిరూపించుకుంటానంటూ హామీ ఇస్తోంది. శాంతి కథ విన్న వారంతా ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఆమెకు ఎవరైనా మంచి అవకాశం ఇస్తే బాగుంటుందంటూ చెబుతున్నారు. తప్పకుండా శాంతి ఒక ఆర్టిస్టుగా ఎదగాలని, ఆమె తన కుటుంబానికి అండగా నిలవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. శాంతి ఎదుర్కొన్న కష్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: వినాయక చవితి స్పెషల్ షోలో సుమన్ టీవీ యాంకర్ రోషన్! గెటప్ శ్రీనుకి స్ట్రాంగ్ రిప్లై! ఇదీ చదవండి: ‘జబర్దస్త్’లోకి సోషల్ మీడియా సెన్సేషన్ బంగారం! “ఛీ పోరా” అంటూ రచ్చ