బుల్లితెరపై సీరియల్స్ ద్వారా అలరించే సెలబ్రిటీలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉన్నప్పటికీ.. నటన పరంగానే ప్రేక్షకులకు దగ్గరవుతారు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ‘కార్తీక దీపం’ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ ద్వారా ఆర్టిస్టులు ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత క్యారెక్టర్స్ ఎలా జనాల్లోకి దూసుకెళ్లాయో.. అదేవిధంగా డాక్టర్ బాబు – వంటలక్క పిల్లల క్యారెక్టర్స్ హిమ, శౌర్య కూడా చాలా ఫేమస్. అయితే.. ఇప్పుడీ సీరియల్ లో పిల్లలు పెద్దవారు అయిపోయారు కాబట్టి.. మనం ఆ పాత్రలలో యంగ్ ఆర్టిస్ట్ లను చూస్తున్నాం.
ఇదివరకు హిమ, శౌర్య పాత్రలలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన కృతిక, సహృద ఇప్పుడు సీరియల్ లో కనిపించడం లేదు. అయినప్పటికీ మొన్నటివరకూ సీరియల్స్ కనిపించిన వీరిద్దరూ.. ఇప్పుడిప్పుడే సినిమాలలో కూడా కనిపిస్తున్నారు. అయితే.. ఇప్పటివరకూ కృతిక, సహృదల యాక్టింగ్ మాత్రమే చూశారు. కానీ.. తాజాగా మా టీవీ యాజమాన్యం వారు నిర్వహించిన ‘పరివార్ అవార్డ్స్’లో ఇద్దరూ అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ చేశారు. వీరి డాన్స్ చూసిన బుల్లితెర ఆడియెన్స్.. నటన మాత్రమే కాదు.. డాన్స్ లో కూడా స్టార్స్ అనిపించుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.