'జబర్దస్త్' యాంకర్ గా సౌమ్య కొన్నాళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. అయితేనేం యాంకరింగ్ తో రోజురోజుకీ క్రేజ్ పెంచుకుంటూ పోతోంది. ఇప్పుడు ఆమె, జడ్జి ఇంద్రజని హర్ట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?
‘జబర్దస్త్’ షోకి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు క్రేజ్ చాలావరకు తగ్గిపోతూ వస్తోంది. స్టార్ కమెడియన్స్ అయిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లు లేకపోవడం వల్ల కావొచ్చు, స్కిట్స్ సరిగా వర్కౌట్ కాకపోవడం వల్లో తెలీదు గానీ ప్రేక్షకులు చాలావరకు దూరమవుతూ వచ్చారు. షో డైరెక్టర్స్ మాత్రం కొన్నిసార్లు కాంట్రవర్సీ, డ్రామా క్రియేట్ చేస్తూ హైప్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే టీమ్ లీడర్స్ గొడవ పడటం, కమెడియన్స్ స్టేజీ దిగి వెళ్లిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు యాంకర్-జడ్జి మధ్య అలాంటిదే ఓ చిన్న గొడవ పెట్టినట్లు ఉన్నారు. ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘జబర్దస్త్’ జడ్జిగా రోజా తన మార్క్ చూపించింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆ స్థానంలోకి ఇంద్రజ వచ్చింది. తన నవ్వు, కామెడీ పంచులతో చాలా క్రేజ్ తెచ్చుకుంది. జడ్జిమెంట్ ఇచ్చే విషయంలోనూ ఇంద్రజ స్టైల్ పై సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ కూడా వస్తుంటాయి. ఇప్పటికే కొన్ని వచ్చాయి కూడా. తాజాగా రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ ప్రోమో చూస్తే మాత్రం.. ఇంద్రజని యాంకర్ సౌమ్య హర్ట్ చేయడం కనిపించింది. అయితే ఇదంతా నిజంగా జరిగిందా? లేదా టీఆర్పీ కోసం చేసిన స్టంట్ అనేది తెలియట్లేదు. పూర్తి ఎపిసోడ్ వస్తే గానీ అసలు విషయం బయటపడదు.
ఈ ఎపిసోడ్ లో భాగంగా శ్రీరామనవమి వేడుకల్ని ‘జబర్దస్త్’లో సెలబ్రేట్ చేసుకున్నారు. రాఘవ, తాగుబోతు రమేశ్-వెంకీ టీమ్స్ వేర్వేరుగా పానకం తయారుచేశారు. వాటిలో ఏది బాగుందో చెప్పాలని యాంకర్ సౌమ్య కోరింది. టేస్ట్ చూసిన ఇంద్రజ.. రాఘవ టీంది బాగుందని చెప్పింది. సౌమ్య మాత్రం.. తాగుబోతు రమేశ్-వెంకీ టీమ్ ది బాగుందని, ఓసారి టేస్ట్ చూడండని అడిగింది. అయినా సరే రాఘవ గారు చేసిందే బాగుందని ఇంద్రజ క్లారిటీ ఇచ్చేసింది. ఆ తర్వాత యాంకర్ సౌమ్య… స్టేజీపై ఉన్న మిగతా వాళ్లని కూడా టేస్ట్ గురించి అడిగింది. దీంతో ఇంద్రజ హర్ట్ అయిపోయింది. ‘ఇంతమంది ఒపీనియన్ తీసుకున్నట్లయితే నన్ను ఎందుకు అడిగారు. ఇది కరెక్ట్ కాదు’ అని సౌమ్యపై సీరియస్ అయిపోయింది. రాఘవ స్టేజీ దిగి కిందకు వెళ్లిపోతున్నట్లు ప్రోమోని ఎండ్ చేశారు. మరి ఈ విషయమై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.