బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ్ అంటే గుర్తుపట్టలేరు కానీ.. గుప్పెడంత మనస్సు హీరో రిషి అనగానే మదిలో మెదిలేస్తారు. దులో రిషి, వసుధారల లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. రిషికి చాలా మంది మహిళా అభిమానులున్నారు. ఈ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందంటే.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. ఈ బృందాన్ని కలిసి అభినందించారు. అయితే అతడి..
బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ్ అంటే గుర్తుపట్టలేరు కానీ.. గుప్పెడంత మనస్సు హీరో రిషి అనగానే మదిలో మెదిలేస్తారు. కన్నడ నటుడైన తెలుగు బుల్తితెరపైకి వచ్చి హవాను చాటుతున్నాడు. తొలుత ప్రేమ్ నగర్ అనే సీరియల్ ద్వారా ముఖేష్ పరిచమయ్యారు. ఆ తర్వాత గుప్పెడంత మనస్సు హీరోగా మారారు. తొలుత రిషి అంటే ఇగోస్టిక్ పర్సన్ గా కనిపించారు. అలాగే ఇందులో రిషి, వసుధారల లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. రిషికి చాలా మంది మహిళా అభిమానులున్నారు. ఈ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందంటే.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. ఈ బృందాన్ని కలిసి అభినందించారు. అలాగే ఓ టీవీ ప్రోగ్రామ్‌లో అతడు తల్లిదండ్రుల కనబర్చిన తీరును చూసి వ్యక్తిగతంగా కూడా ముఖేష్ కు ఫ్యాన్స్ అయిపోయారు.
తెరపై తుళ్లుతూ కనిపించే రిషీ పర్సనల్ లైఫ్‌లో చాలా కష్టాలు ఉన్నాయి. తండ్రి పక్షవాతంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే రిషి ఇంట్లో విషాదం నెలకొన్నట్లు సమాచారం. అతని తండ్రి మృతి చెందినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన ఇంటివద్దనే చికిత్స పొందుతూ మృతి చెందారట. ఈ విషయం తెలిసిన ముఖేష్.. షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో అతడి తండ్రి అంటే ఎంత ఇష్టమో స్టార్ మా పరివార్ అవార్డ్స్ సందర్భంగా వ్యక్తం చేసి.. ఇటువంటి బిడ్డ కావాలిరా అనిపించేలా చేశాడు ముఖేష్. కర్ణాటకకు చెందిన రిషీది చిన్నఫ్యామిలీ.. తల్లిదండ్రులు, ఓ చెల్లి ఉన్నారు.
స్టార్ మా పరివార్ ఈవెంట్‌లో తన తల్లిదండ్రులను పరిచయం చేసిన ముఖేష్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ‘ఆయనకు పక్షవాతం వచ్చిన దగ్గర నుండి నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నాను.. అందరి లైఫ్‌లో జరుగుతుందో లేదో నాకు తెలియదు. బట్ నా లైఫ్‌లో జరిగింది. ఆయనకు గెడ్డం తీస్తూ.. దగ్గర ఉండి స్నానం చేయించి బట్టలు మారుస్తూ ఆయనను కన్నకొడుకులా చూసుకుంటున్నాను. అది నా అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం మృతి చెందినట్లు తెలుస్తోంది. మోడలింగ్‌తో కెరియర్ స్టార్ట్ చేసిన ముఖేష్ గౌడ.. 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ గెల్చుకున్నాడు. ఆ తరువాత కన్నడ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ‘నాగకన్నిక’ అనే సీరియల్‌తో డెబ్యూ హీరోగా అడుగుపెట్టాడు.