బిగ్ బాస్ ఫేమ్ హిమజ గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద పరిచయం అక్కర్లేదు. పలు సీరియాల్లో నటించి ఫేమస్ అయ్యింది. అయితే ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అనే సీరియల్లో అమాయకపు అమ్మాయి పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత మరికొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించింది. మరొకవైపు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఓ ఖరీదైన కారుతో వీడియో దిగి.. తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. “ఈ దీపావళికి నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్. నా కల నేరవేరింది” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ ఫేమ్ హిమజ.. తన అందంతో, అభినయంతో బుల్లితెర ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. మొదట సీరియల్స్ లో నటిస్తూ కెరీర్ ప్రారంభించింది. అనంతరం తన అభినయం మంచి గుర్తింపు సంపాదించింది. పలు కామెడీ షోల్లో పాల్గొన్ని తనదైన కామెడీతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్ టైన్ చేసింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం తో పాటు మరికొన్ని సీరియల్స్ తో ఫేమస్ అయింది. ఇక ఈ బ్యూటీ సీరియల్స్, షోల్లో వచ్చిన క్రేజ్ తో వెండితెరపై మెరిసే అవకాశం సంపాదించింది. నేను శైలజ, శతమానం భవతి, వరుడు కావలెను తో పాటు మరికొన్ని తెలుగు సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది హిమజ.
కామెడీ రోల్స్ తో పాటు సీరియస్ పాత్రల్లో కనిపించి.. మంచి గుర్తింపును తెచ్చుకుంది. బిగ్బాస్-3 సీజన్ లో కంటెస్టెంట్గా హిమజ పాల్గొన్నది. అక్కడ తనదైన శైలిలో మిగిలిన సభ్యులకు గట్టి పోటీ ఇచ్చి.. కొన్నివారాల పాటు హౌస్ లో కొనసాగింది. బిగ్ బాస్ అనంతరం హిమజకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. పలు సినిమాలో అవకాశం లభించింది. ప్రస్తుతం సినిమాలపై దృష్టిసారిస్తూ బిజీగా ఉంది హిమజ. మరోకవైపు సోషల్ మీడియాలోను ఈ బ్యూటీ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను అభిమానులతో పేర్ చేసుకుంటుంది. తాజాగా బీఎండబ్ల్యూ కారు కొన్నట్లు..దాని ముందు దిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అంతే కాక “ఈ కారు దీపావళీకి నాకు నేను ఇచ్చుకుంటున్నా ఖరీదైన గిఫ్ట్. నా కల నెరవేరింది” అంటూ పోస్టు రాసుకొచ్చింది. అయితే ఆమెకు అభిమానలు పెద్ద ఎత్తు కంగ్రాట్స్ చెప్తున్నారు. మరికొందరు మాత్రం సందేహంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కారణంగా కూడా ఉంది. హిమజ పలు బ్రాండ్లకు ప్రమోషన్లు చేస్తోంది. కాబట్టి ఇది కూడా ప్రమోషన్ లో భాగమేమో అని సందేహం వ్యక్తం చేశారు. అయితే ఖరీదైన ఈ కారును హిమజ నిజంగానే కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కారుతో హిమజ ఉన్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.