అషు రెడ్డి.. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటుంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన బోల్డ్ పిక్స్ ను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తుంటుంది అషు రెడ్డి.
సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది అషు రెడ్డి. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ షో ద్వారా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని పలు టీవీ షోలల్లో సందడి చేసింది. ఇక ఆర్జీవీతో చేసిన రెండు బోల్డ్ ఇంటర్వ్యూలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. అటు పలు షోలల్లో పాల్గొంటున్న ఈ సోయగం.. తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత వాలెంటైన్స్ రోజున ఎక్స్ ప్రెస్ హరితో కనిపించింది ఈ బ్యూటీ.
అషు రెడ్డి.. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన బోల్డ్ పిక్స్ ను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తుంటుంది అషు రెడ్డి. ఇక గతంలో కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరితో లవ్ ట్రాక్ కూడా నడిపినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరు బుల్లితెరపై ఓ వైపు కామెడీ స్కిట్స్ చేస్తూనే మరోవైపు డ్యూయెట్స్ కూడా పాడుకున్నారు. దాంతో వీరిద్దరి ప్రేమలో పడ్డారు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అదీకాక హరి తన గుండెల పై అషు రెడ్డి పేరును టాటూగా వేయించుకోవడం.. అషు రెడ్డి తన సొంత డబ్బులతో హరికి బైక్ కొనివ్వడం లాంటి సంఘటనలతో వీరిద్దరు ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.
అయితే చాలా గ్యాప్ తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా ఇద్దరు ఓ చోట కలిశారు. తాజాగా ఫిబ్రవరి 14ను ఇద్దరు కలిసి హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమానిటీ అనే ఆర్ఫాన్ హోమ్ లో జరుపుకున్నారు. అక్కడ కేక్ కట్ చేసి ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడి పిల్లలతో ఇద్దరు కలిసి ఆడిపాడారు. పల్సర్ బైక్ పాటకు పిల్లలతో కలిసి ఇద్దరు స్టెప్పులు వేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను అషు తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ” మన దగ్గర ఉన్న అమితమైన ప్రేమను లేని వారికి పంచుదాం” అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. మరి ప్రేమికుల రోజును వీరిద్దరు ఆర్ఫాన్స్ హోంలో సెలబ్రేట్ చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.