సుమ కనకాల.. యాంకర్ గా కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకున్నారు. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్.. ఇలా వేదిక ఏదైనా సరే తనదైన శైలిలో గలగల మాట్లాడుతూ ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. బుల్లితెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. పుట్టింది కేరళలో అయినా తెలుగింటి కోడలై, మాటలతో మాయ చేస్తోంది. రోజూ ఎంతో చురుగ్గా ఉండే సుమ.. రోజూ ఓ విషయంలో బాధ పడుతోందట.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీవీ సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన సుమ, నటుడు రాజీవ్ కనకాలని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఆ తర్వాత పూర్తిగా యాక్టింగ్ దూరమై, యాంకర్ గా మారింది. అలా అలా తెలుగు భాషపై పట్టు పెంచుకుని, మరెవరికి సాధ్యం కానీ విధంగా టాప్ యాంకర్ అయిపోయింది. ఇప్పటికీ.. ప్రతిరోజూ అస్సలు తీరిక లేనంత బిజీగా ఉంటుంది. ఈ ఛానెల్ ఆ ఛానెల్ అని తేడా లేకుండా ప్రతిచోటా కనిపిస్తూనే ఉంటుంది.
ఇలా తీరక లేకుండా ఉన్నాసరే ఫ్యామిలీకి సుమ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది. దానికి తోడు సుమకి వాళ్ల అత్తగారు అంటే చాలా ఇష్టమట. తన అమ్మ తర్వాత అమ్మలా భావించిన ఆమె లేకపోవడంతో సుమ ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారట. తాను ఎన్ని ఫంక్షన్స్, ఎన్ని షోలు చేసినా… ఏ ఈవెంట్ కి వెళ్లినా తన పిల్లల్ని దగ్గర ఉండి తనకన్నా బాగా ఆమె చూసుకునేవారట. ప్రస్తుతం అత్తగారు తమతో లేకపోవడంతో.. ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే సుమ ఆమె ఫొటో చూసి బాధపడుతున్నారట. దీని గురించి సుమ తన స్నేహితురాలికి చెప్పుకోవడంతో.. ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిందట. మరి సుమ దీనిపై స్పందించాల్సి ఉంది.
ఇదిలాఉండగా అన్వేషిత, స్వయంవరం, గీతాంజలి లాంటి సీరియల్స్ చేసిన సుమ.. కల్యాణ ప్రాప్తిరస్తు, పవిత్ర ప్రేమ, వర్షం, ఢీ, బాద్ షా తదితర సినిమాల్లోనూ చిన్న చిన్న రోల్స్ చేసింది. ఈ ఏడాది సుమ ప్రధానపాత్రధారిగా నటించిన జయమ్మ పంచాయతీ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. మరి సుమ గురించి వస్తున్న ఆర్టికల్స్ గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: అరుదైన వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ.. సరైన అవగాహన లేకే ఇలా అయ్యింది!