సంక్రాంతి అలా వెళ్లిపోయిందో లేదా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శుభకార్యాలు ఊపందుకున్నాయి. పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి కొత్తింట్లోకి అడుగుపెట్టడం వరకు చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పలువురు యూట్యూబర్స్.. గత కొన్ని నెలల్లో ఇల్లు, కార్లకు ఓనర్లు అవుతున్నారు. మంచి ముహుర్తాలు ఉండటం వల్ల ఏమోగానీ అస్సలు లేట్ చేయట్లేదు. ఇక ఇప్పుడు యాంకర్ గా పేరు తెచ్చుకున్న శివజ్యోతి కూడా కొత్తింట్లోకి అడుగుపెట్టేసింది. అందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయడంతో పాటు ఆ విశేషాలను కూడా షేర్ చేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్ని నెలల ముందు శివజ్యోతి Shiva Jyothi New House, shiva jyothi husband, Bigg Boss 3 Telugu contestantsతన అత్తారింటికి సంబంధించిన ఓ వ్లాగ్ పోస్ట్ చేసింది. చాలా ఖర్చు పెట్టి మరీ ఇంటీరియర్ చేయిస్తే అదంతా కూలిపోయిందని చెప్పి బాధపడింది. ఆ తర్వాత మళ్లీ మొత్తం బాగు చేయించినట్లు తెలుస్తోంది. తాజాగా అదే ఇంట్లోకి శివజ్యోతి దంపతులు గృహప్రవేశం చేశారు. అందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోలో భాగంగా ఇద్దరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చున్నారు.
ఇక పూజ జరుగుతున్నప్పుడు దాన్ని మొత్తం షూట్ చేసి చూపించిన శివజ్యోతి.. ఇంటికొచ్చిన అతిథుల్లో మహిళల కాళ్లకు పసుపు రాయడం, తర్వాత వాళ్లకు తాంబూలం ఇవ్వడంతో పాటు వంటకోసం ఏమేం చేశారనే విజువల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దగ్గర్లోని గుడికి వెళ్లి దేవుడికి కొబ్బరికాయ కొట్టారు. ఇలా తన అత్తారింట్లో శివజ్యోతి తెగ సందడి చేసింది. ఈ వీడియో తర్వాత గిఫ్ట్స్ కు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేసే అవకాశముంది. మరి శివజ్యోతి, కొత్తింట్లోకి అడుగుపెట్టడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.