ఇంత కాలం జబర్దస్త్ షోలో తన అంద చందాలతో అలరించిన యాంకర్ అనసూయ.. ఆ షో నుండి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా తనేంటో నిరూపించుకున్న అనసూయ.. ఇటు బుల్లితెరపై షోలు, అటు సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు. జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసిన ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జబర్దస్త్‌ను వదిలేసి వస్తున్నానంటే భయం వేసిందని, టీవీకి దూరం అవుతానేమో అని అనిపించిందని, ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఎలాంటి అనుభూతి అయితే కలుగుతుందో అలాంటి అనుభూతే తనకు కలిగిందని అనసూయ అన్నారు. తాను కేవలం ఏదో ఒక దానికి మాత్రమే పరిమితం కాదని, టీవీ షోలు, సినిమాలు రెండూ తనకు ముఖ్యమే అని అన్నారు.
అయితే టీవీ ఇండస్ట్రీ ప్రస్తుతం చాలా కలుషితమైపోయిందని, దీని వల్ల తాను చాలా బాధపడ్డానని ఆమె అన్నారు. టీవీ ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఏవైతే ఉంటాయని భయపడ్డానో అవి లేవని, మనం తీసుకునే ఛాయిస్ బట్టే ఉంటుందని అన్నారు. మంచి, చెడు ప్రతీ చోటా ఉన్నాయని, టీవీ ఫీల్డ్‌లో కూడా ఉన్నాయని అన్నారు. చెడు దారి ఎంచుకుంటే త్వరగా పైకి ఎదగవచ్చు అనుకుంటే.. ఆ దారి ఎంచుకోండని, ఎవరి జడ్జిమెంట్ అవసరం లేదని ఆమె అన్నారు. అయితే తాను ఎంచుకున్న దారి తనకి కంఫర్ట్ ఇచ్చిందని, ఏదో ఆఫీస్‌కి వెళ్ళి వస్తున్నట్లుగా ఉండేదని అన్నారు. కాకపోతే కొన్నిసార్లు ఇబ్బందులు పడ్డానని, తనకు నచ్చకపోయినా కొనసాగానని ఆమె చెప్పుకొచ్చారు.
ఇక తాను సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తినని, భయపడుతూనే టీవీ ఇండస్ట్రీకి వచ్చానని అన్నారు. టీవీ ఫీల్డ్‌లోకి అడుగుపెడుతున్నానంటే మేకప్ వేసుకుంటావా? కెమెరాను ఫేస్ చేస్తావా? అని అనేవారని.. కానీ ధైర్యం చేసి ఈ ఫీల్డ్‌లోకి వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే తనకు ఆత్మగౌరవం ఎక్కువే అని, అది దెబ్బ తినేలా ఉంటే ఒక్క క్షణం కూడా ఉండనని ఆమె అన్నారు. తనకైనా, తన క్యారెక్టర్‌కైనా ఏ మాత్రం అపాయం ఉందన్నా.. వెంటనే అక్కడి నుండి క్విట్ అయిపోతానని ఆమె అన్నారు. ఈ ఫీల్డ్‌లో ఆత్మగౌరవం దెబ్బ తింటుందంటే.. తాను ఎంబీఏ చేశాను, హెచ్‌ఆర్‌గా కూడా పని చేశాను కాబట్టి నాకు అవకాశం ఉందని అన్నారు. అది కూడా కుదరకపోతే ఇంట్లో అంట్లు తోముకుంటూ ఉంటానని, సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యమని ఆమె అన్నారు. తనను తాను అద్దంలో చూసుకున్నప్పుడు శభాష్ అనుకునేలా ఉండాలని, దాని కోసమే జీవిస్తానని, ప్రస్తుతం అదే మార్గంలో ఉన్నానని ఆమె అన్నారు. మరి అనసూయ కామెంట్స్‌పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.