అమ్మతనం.. పెళ్లైన ప్రతీ స్త్రీ కోరుకునే ఓ మధురానుభూతి. పెళ్లి తర్వాత ఎప్పుడెప్పుడు అమ్మా అని పిలిపించుకోవాలా అని ఎదురుచూస్తుంటారు మహిళలు. ఇక పది సంవత్సరాల తర్వాత తల్లి కాబోతున్నాను అని తెలిస్తే.. ఆ స్త్రీ పడే సంతోషం అంతాఇంతా కాదు. అయితే ఈ క్రమంలోనే గతేడాది నవంబర్ 24న తాను గర్భం దాల్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది సీరియల్ నటి నేహా మాద్ర. నేహా మాద్ర అంటే మీకు తెలియక పోవచ్చు.. చిన్నారి పెళ్లి కూతురు నటి అంటే మీరు ఇట్టే గుర్తుపట్టేస్తారు. తాజాగా నేహాకు సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నేహా మాద్ర.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో గెహనాగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్ చూసే మహిళలకు నేహా మాద్ర సుపరిచితురాలే. ఇక 2012లో బిజినెస్ మెన్ అయిన ఆయుష్మాన్ ను వివాహం చేసుకుంది నేహా. ఈ క్రమంలోనే పెళ్లైన 10 సంవత్సరాలకు తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్ లో తన భర్తతో పాటుగా బేబీ బంప్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది. పెళ్లైన పదేళ్లకు గర్భం దాల్చడంతో ఆమె ఇంట ఆనందాలు వెళ్లివిరిశాయి. దాంతో తాజాగా నేహాకు సీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఇక సీమంతానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా షేర్ చేసింది నేహా మాద్ర. ‘ నా కడుపులో ఉన్న బిడ్డపై ఎనలేని ప్రేమ చూపిస్తున్న మీకు ధన్యవాదాలు. ఈ సీమంతం నాకో కలలా అనిపిస్తోంది’ అని భావోద్వేగానికి లోనైంది నేహ. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు ఈ వేడుకకు హాజరై దంపతులను దీవించారు. ప్రస్తుతం నేహా మాద్ర సీమంతం వేడుకలకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరగా మారాయి. దాంతో అభిమానులు చిన్నారి పెళ్లికూతురు నటికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.