అషు రెడ్డి తన తండ్రి పంపిన ఓ గిఫ్ట్ ను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసుకుంది. ఇక ఆ స్టోరీ చూసిన నెటిజన్లు.. అషు రెడ్డికి తండ్రి ఇలాంటి గిఫ్ట్స్ కూడా పంపుతాడా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
సాధారణంగా తల్లిదండ్రులకు పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుంది. దాంతో పిల్లలు ఏది అడిగితే అది కొనిస్తారు. అదీకాక స్పెషల్ డేస్ లల్లో ప్రత్యేక బహుమతులు పంపి సర్ప్రైజ్ చేస్తారు. ఇక అమ్మాయిలకు తండ్రితో మంచి అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం కారణంగానే.. అబ్బాయిల కంటే ఎక్కువగా ఆడపిల్లను ప్రేమగా చూసుకుంటారు. ఈ క్రమంలోనే అషు రెడ్డి తన తండ్రి పంపిన ఓ గిఫ్ట్ ను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసుకుంది. ఇక ఆ స్టోరీ చూసిన నెటిజన్లు.. అషు రెడ్డికి తండ్రి ఇలాంటి గిఫ్ట్స్ కూడా పంపుతాడా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ అషు తండ్రి ఆమెకు ఏ గిప్ట్ పంపిచాడో తెలుసా? మందు బాటిల్ పంపించాడండీ బాబు.. మందు బాటిల్ అంటే ఏ దగ్గు మందో.. జ్వరం మందో కాదు.. నికార్సైన మద్యం బాటిల్.
అషు రెడ్డి.. టిక్ టాక్ ద్వారా సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది. ఇక అక్కడి నుంచి అషు రెడ్డి రేంజ్ మారిపోయింది. డబ్ స్మాష్స్ వీడియోలతో మరింతగా పేరు సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ. ఇక అక్కడి నుంచి వెనుతిరిగిచూసుకోలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపి వార్తల్లో నిలిచింది. అదీకాక తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది ఈ బోల్డ్ బ్యూటీ. ఇక ఆర్జీవీతో చేసిన రెండు ఇంటర్వ్యూలతో అషుకు కావాల్సినంత క్రేజ్ వచ్చింది. ఓ వైపు బుల్లితెర షోల్లో అదరగొడుతూనే.. సోషల్ మీడియాలో తన పిక్స్ తో హల్ చల్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఓ ఫోటోను తన సోషల్ మీడియలో షేర్ పెట్టి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.
ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా అషు రెడ్డి ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అసలు ఆ స్టోరీలో ఏముందంటే? తన తండ్రి తనకు ఓ మద్యం బాటిల్ గిఫ్ట్ గా పంపించాడని మురిసిపోయింది. కూతురుకి డాడీ గిఫ్ట్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ గిఫ్ట్ తన తల్లికి నచ్చలేదని రాసుకొచ్చింది ఈ బోల్డ్ బ్యూటీ. ఇక ఈ స్టోరీ చూసిన ఫ్యాన్స్ వామ్మో.. అషు రెడ్డికి తండ్రి ఇలాంటి బహుమతులు కూడా ఇస్తాడా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక ఈ స్టోరీపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి అషు రెడ్డికి తండ్రి మందు బాటిల్ గిఫ్ట్ గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.