యూట్యూబ్ అంటే ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ అందించే ప్లాట్‌ఫామ్ మాత్రమే కాదు. ప్రస్తుతం ఎందరికో ఉపాధి కల్పిస్తున్న వేదిక. టాలెంట్ ఉండి.. దాన్ని ప్రదర్శించే సరైన వేదిక దొరక్క.. ఇబ్బంది పడుతున్న వారికి యూట్యూబ్ ఒక అద్భుతమైన అవకాశంగా నిలిచింది. తమలోని ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడమే కాక.. ఆదాయం పొందే వనరుగా నిలిచింది. ఇక కరోనా తర్వాత యూట్యూబ్ వినియోగం మరింత పెరిగింది. సినిమాలు, షూటింగ్‌లు బంద్ కావడంతో చాలా మంది సెలబ్రిటీలు యూట్యూబ్ చానెల్ ప్రారంభించి.. వీడియోలు, వ్లాగ్స్ చేసి అదనపు ఆదాయం ప్రారంభిస్తున్నారు. ఇక సెలబ్రిటీలు.. తమ హోమ్ టూర్, ఫ్రిజ్ టూర్ ఇలా రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ టాలీవుడ్ బుల్లితెర నటుడు తన హోమ్ టూర్ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం అది ట్రెండింగ్‌లో ఉంది. ఆ వివరాలు..
బుల్లితెర నటుడు ఏక్నాథ్ సీరియల్స్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుత అన్ని చానెల్స్‌లో సీరియల్స్ చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఏక్నాథ్ భార్య హారిక కూడా నటే. ఇద్దరు పలు సీరియల్స్‌లో నటిస్తూ.. కెరీర్లో బిజీగా ఉన్నారు. ఇక పర్సనల్ లైఫ్‌లో కూడా భార్యాభర్తలిద్దరూ రీల్స్, ఫోటోషూట్లకు పొజులిస్తూ.. వీడియోలు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. అభిమానులను అలరిస్తారు. ఇక ఈ జంట.. యూట్యూబ్‌లో ఏక్హారి పేరుతో యూట్యూబ్ చానెల్ ప్రారంభించి.. వీడియోలో, వ్లాగ్స్ చేసి.. వాటిని చానెల్లో అప్లోడ్ చేస్తారు.
ఈ క్రమంలో తాజాగా ఏక్నాథ్.. తన ఇంటి హోమ్‌టూర్ వీడియో చేసి.. యూట్యూబ్ చానెల్లో అప్లోడ్ చేశారు. అయితే ఇది వారు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు కాదు.. ఏక్నాథ్ పుట్టి, పెరిగిన ఇంటిని చూపించాడు. ఇక ఏక్నాథ్ సొంత ఊరు చిట్టూర్పులోని తన ఇంటిని చూపించాడు. అయితే ఇది ముచ్చటైన పెంకుటిల్లు కావడం విశషం. ఇంటిలోపల దారికిరువైపులా.. బోలెడన్న మొక్కలు, చెట్లు, తులసివనం దర్శనమిచ్చాయి. ఇక ఇంట్లోకి వెళ్లగానే ముందు పెద్ద వరండా.. తర్వాత హాల్, బెడ్రూం, కిచెన్ వరుసగా వచ్చాయి. ఇక గదులన్ని విశాలంగా, ప్రశాంతంగా ఉన్నాయి.
ఇక వంట చేసుకోవడానికి వీలుగా.. ఇంటి బయట ప్రత్యేకంగా ఓ పాక నిర్మించారు. ఇక ఇంటి వెనకాల కూడా అరటి, మామిడి, ఉసిరి, కొబ్బరి, దానిమ్మ, నిమ్మ, బాదం, సపోటా ఇలా రకరకాల చెట్లతో ఎంతో చూడముచ్చటగా ఉంది. ఇక ఇంట్లో పాతకాలం నాటి వస్తువులు కూడా ఉన్నాయి. వీటన్నింటిని చూసిన అభిమానులు.. అబ్బా మీ ఇల్లు ఎంత బాగుంది అండి.. ప్రశాంతంగా.. అందంగా.. చూటముచ్చటగా ఉంది. మీ ఇంటిని చూస్తే.. మా బాల్యం గుర్తుకు వస్తోంది. ఇంత అద్భుతమైన ఇంటిని, జీవితాన్ని వదులుకుని.. సిటీల్లో ఏంటో ఈ జీవితాలు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజనులు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.