త్రిష.. దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 23 ఏళ్లుగా వన్నెతరగని అందంతో ఇండస్ట్రీలో వెలుగొందుతుంది త్రిష. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ 10 ఏళ్ల వరకు కొనసాగడమే మహా గగనం. అలాంటిది త్రిష ఏకంగా 23 ఏళ్లుగా హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది త్రిష. తాజాగా వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది త్రిష. ఈ సినిమాలో ఆమె పొషించిన కుందవై పాత్రలో త్రిష చూపించిన రాజసం, అద్భుతమైన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ తర్వాత త్రిష క్రేజ్ మరోసారి పెరిగింది. వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ సినిమా విజయంతో త్రిష తన రెమ్యూనరేషన్‌ని డబుల్ చేసిందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే.. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది త్రిష.
ఈ క్రమంలో తాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫోటో చూసిన ఫ్యాన్స్.. తెగ ఆందోళన చెందుతున్నారు. కాలికి పట్టీతో ఉన్న ఫోటోని షేర్ చేసింది త్రిష. ఇది చూసిన అభిమానులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ చిత్రం విజయం తర్వాత వెకేషన్‌కు వెళ్లింది త్రిష. అయితే అనుకోకుండా ప్రమాదానికి గురి కావడంతో.. ఆమె కాలు విరిగింది. ఈ క్రమంలో కాలికి పట్టీ వేసి ఉన్న ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది త్రిష. ఈ ప్రమాదం వల్ల వెకేషన్ మధ్యలోనే వెనక్కి రావాల్సి వచ్చిందని చెప్పింది.
ఈ ఫోటో చూసిన నెటిజనులు.. త్రిష ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కోరుతున్నారు. 40ఏళ్లకు దగ్గరవుతున్నా కూడా ఎంతో యంగ్‌గా.. మరింత అందంగా కనిపిస్తోంది త్రిష. ఇక పొన్నియన్ సెల్వన్ చిత్రంలో తన అందంతో యువరాణి కుందవై పాత్రలో ఐశ్యర్యారాయ్‌కి పోటీగా నిలిచింది త్రిష. ఇక టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ త్రిష.. తెలుగులో మెగాస్టార్, వెంకటేష్, బాలయ్య వంటి అగ్రహీరోలతో కలిసి పనిచేసింది. అంతేకాదు… ప్రభాస్ , మహేష్ వంటి స్టార్ హీరోలతో కూడా కలిసి సినిమాలు చేసింది. త్రిష-ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన వర్షం సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచి.. ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది త్రిష.