ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ అడుగు పెడుతూనే ఉంటారు. కొంతమంది మొదటి అడుగులోనే సక్సెస్ అవ్వొచ్చు.. ఇంకొంతమంది కొన్నాళ్ళు ప్రయత్నిస్తేగాని సక్సెస్ కాలేరు. అయితే.. ఇప్పుడు మనం ఫొటోలో చూస్తున్న చిన్నారి.. టాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ చేసి.. ఫస్ట్ మూవీతోనే బిగ్ సక్సెస్ ఖాతాలో వేసుకుంది.
ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ అడుగు పెడుతూనే ఉంటారు. కొంతమంది మొదటి అడుగులోనే సక్సెస్ అవ్వొచ్చు.. ఇంకొంతమంది కొన్నాళ్ళు ప్రయత్నిస్తేగాని సక్సెస్ కాలేరు. కానీ.. ఎవరైనా సరే ఏదొక టైమ్ లో సక్సెస్ అవుతుంటారు. అయితే.. ఇప్పుడు మనం ఫొటోలో చూస్తున్న చిన్నారి.. టాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ చేసి.. ఫస్ట్ మూవీతోనే బిగ్ సక్సెస్ ఖాతాలో వేసుకుంది. అదికూడా సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్ – స్టార్ హీరో కాంబినేషన్ లో మొదటి అవకాశం అందుకోవడం విశేషం. అయితే.. ఈ బ్యూటీ హీరోయిన్ గా డెబ్యూ చేసింది.. రీసెంట్ గా మాత్రం కాదు. ఎందుకంటే.. టాలీవుడ్ కంటే ముందే ఆమె బాలీవుడ్ లో డెబ్యూ చేసేసింది.
మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి వచ్చిన.. ఈ భామ బాలీవుడ్ లో డెబ్యూ చేసిన నాలుగేళ్లకు తెలుగులో అడుగుపెట్టింది. పైగా రావడంతోనే డీసెంట్ రోల్ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. సరే తెలుగు వరకంటే డీసెంట్ గా కనిపించింది. కానీ.. తిరిగి బాలీవుడ్ కి వెళ్ళిపోయి.. అక్కడ అందాలను బోల్డ్ గా షో చేయడంలో ముదురు అనిపించుకుంది. అందుకే ఆ మధ్య అమ్మడి ఫోటోషూట్స్ సైతం ఎన్నో చర్చలకు దారి తీశాయి. పైన ఫోటోలో కనిపిస్తున్న పాపను ఇప్పటికైనా గుర్తుపట్టారా? ఆల్రెడీ మీకు ఇవ్వాల్సిన క్లూస్ అన్ని ఇచ్చేశా. మీరు కొంచం బుర్రకు పదును పెడితే.. ఇట్టే కనిపెట్టేయగలరు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమా చేస్తోంది.
ఇంతకన్నా.. క్లూ ఇస్తే ఇక ఆమె చెప్పినట్లే అవుతుంది. మరి క్లూ ఇవ్వడం కష్టంగా ఉంటే.. ఎవరో చెప్పేయొచ్చు కదా.. అని మీకు అనిపించవచ్చు. బట్.. ఈ పాప మొదటి రెండు సినిమాలు తెలుగులో స్టార్స్ సరసన చేసింది. అయితే.. మొదటి సినిమా హిట్ అయినా.. రెండో సినిమా కాస్త బెడిసి కొట్టింది. అయితే.. ప్లాప్ పడినా సరే ప్రెజెంట్ రెండో ఛాన్స్ ఇచ్చాడు ఆ స్టార్. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? ఆమె ఎవరో కాదు. రీసెంట్ గా తోటి బాలీవుడ్ హీరోని పెళ్లాడింది. ఓ.. ఇప్పుడు లైన్ లోకి వచ్చేసినట్లున్నారు. అవును.. హీరోని పెళ్లాడిన అదే హీరోయిన్.. RC15 హీరోయిన్ కియారా అద్వానీ. భరత్ అనే నేను, వినయ విధేయ రామ.. తర్వాత తెలుగులో RC15 చేస్తోంది. కాగా.. ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లాడిన సంగతి తెలిసే ఉంటుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కియారా చైల్డ్ హుడ్ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి కియారా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.