సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు శనివారం రాత్రి అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు ముగిసాయి. అంత్యక్రియలకు ముందు రమేష్ బాబు పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. కుమారుడి మృతదేహాన్ని చూసి కృష్ణ-ఇందిర దంపతులు చలించిపోయారు. రమేష్ బాబు హీరోగా నిలదొక్కుకోలేకపోవడం పట్ల కృష్ణ చాలా బాధపడేవారట.
ఇది కూడా చదవండి : ఆ సినిమానే రమేష్ బాబు కెరీర్ కి మైనస్ అయ్యిందా?
రమేష్ బాబుని ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి కృష్ణ బలంగా అనుకోవడమే కాక.. నటనలో ట్రైనింగ్ ఇప్పించి గ్రాండ్ గా పరిచయం చేయాలనుకున్నారు. ఈ క్రమంలో వి. మధుసూదన రావు దర్శకత్వంలో సామ్రాట్ చిత్రం ద్వారా రమేష్ బాబును ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే అప్పట్లో ఈ టైటిల్ వివాదాస్పదమైంది. బాలకృష్ణ కూడా తన సినిమాకి ‘సామ్రాట్’ అనే టైటిల్ పెట్టుకున్నారు. దీంతో కృష్ణ గారు కోర్టుకి వెళ్లి టైటిల్ కోసం పోరాడారు.
ఇది కూడా చదవండి : రమేష్ బాబు మృతి.. మహేష్ కు కడసారి చూపు దక్కెనా?
ఫైనల్ గా టైటిల్ కృష్ణకే చెందుతుందని కోర్టు తీర్పు ఇవ్వడంతో బాలకృష్ణ తన సినిమాకి ‘సాహస సామ్రాట్’ అని పేరు మార్చుకోవాల్సి వచ్చింది. రమేష్ బాబు ‘సామ్రాట్’ 1987లో విడుదలైంది. ఆ తరువాత కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో చేసిన ‘బజార్ రౌడీ’ అనే సినిమా రమేష్ బాబుకి భారీ విజయాన్ని అందించింది. అతడి కెరీర్ లో ఇదొక బ్లాక్ బస్టర్. దాసరి నారాయణ రావు, వి మధుసూదనా రావు, జంధ్యాల, కె మురళి మోహన్ రావు, ఎస్ ఎస్ రవిచంద్ర లాంటి దర్శకులతో పని చేసినా.. హీరోగా మాత్రం ఎక్కువకాలం రాణించలేకపోయారు రమేష్ బాబు. కానీ కృష్ణగారు మాత్రం ఎప్పుడూ రమేష్ బాబు గురించే ఆలోచించేవారట. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.