కొద్దికాలంగా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోతోంది. ఇదివరకు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు.. చిన్న సినిమాలు కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే మహమ్మారి కారణంగా సినిమాలన్నీ స్ట్రక్ అయిపోయాయో.. రిలీజ్ లేట్ అవుతున్నకొద్దీ ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీంతో పోటీగా పెద్ద సినిమాలు ఉన్నా, థియేటర్స్ సరిపడా దొరకపోయినా రిలీజ్ చేసేస్తున్నారు. గతవారం కేవలం తెలుగులోనే దాదాపు 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే.. అవన్నీ తెలుగులో డబ్ వెర్షన్ రిలీజ్ అవ్వడం విశేషం.
ఈ క్రమంలో ఈ వారం కూడా థియేట్రికల్ రిలీజ్ కి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. కాకపోతే.. ఈసారి తెలుగులో మూడు సినిమాలు రిలీజ్ అవుతుండగా.. కేవలం హిందీలోనే ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే.. ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలలో సమంత నటించిన ‘యశోద’ మూవీకి మంచి బజ్ ఏర్పడింది. మరోవైపు అమితాబ్ నటించిన ఊంచయ్ హిందీలో రిలీజ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఏ మూవీ విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది. మరి ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో పోటీ పడనున్న 8 సినిమాలేవో చూద్దాం!