బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగులో తమ సత్తచాటిన నటీమణులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో సనా ఖాన్ ఒకరు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది సనా ఖాన్. కెరీర్ బాగాసాగుతున్న సమయంలో అనూహ్యంగా గుడ్ బై చెప్పింది.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో అతికొద్దిమంది స్టార్ హీరోయిన్స్ గా రాణించారు. అలాంటి వారిలో సనా ఖాన్ ఒకరు. 2005 లో ‘యెహీ హై హై సోసైటీ’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన సనాఖాన్ అసలు పేరు సయ్యద్ సనాఖాన్. మొదటి చిత్రం తర్వాత బాలీవుడ్ లో పలు యాడ్స్ లో నటించింది. సనా ఖాన్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మంచి పేరు సంపాదించింది. తాజాగా సనా ఖాన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది సనాఖాన్. తాజాగా సనా ఖాన్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం సనా ఖాన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోష విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 2005 లో ‘యెహీ హై హై సోసైటీ’చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సనా ఖాన్ తర్వాత వరుసగా ఇతర భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో కళ్యాణ్ రామ్ తో కత్తి, మంచు మనోజ్ తో మిస్టర్ నూకయ్య, నాగార్జున హీరోగా నటించిన గగనం, దిక్కులు చూడకు రామయ్య చిత్రాల్లో నటించింది.
ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న సమయంలో సనా ఖాన్ హఠాత్తుగా కెరీర్ కి గుడ్ బై చెప్పింది. 2020 లో అనాస్ సయ్యద్ ని వివాహం చేసుకుంది. కానీ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా తనకు పండంటి మగబిడ్డ జన్మించినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ.. ‘ఇప్పటి వరకు మీ ప్రేమాభిమానాలు మాపై ఉంచినందుకు ధన్యవాదాలు.. మీ ప్రేమ, దీవెనలు మా బిడ్డపై ఉండాలని మరసారా కోరుకుంటున్నాను.. అల్లాహ్ అందరినీ కాపాడుతాడు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.