సోషల్ మీడియా పుణ్యమాని మన హీరో హీరోయిన్ల విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. వారు చేస్తున్న సినిమాలే కాదూ.. చిన్నప్పుడు వాళ్లు ఎలా ఉన్నారో కూడా తెలుస్తున్నాయి. కొన్ని సార్లు వాళ్లకు సంబంధించిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తున్నారు నటీనటులు. అటువంటి ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.
రేడియో, టివీల కాలం పోయి.. అరచేతిలో పట్టే మాధ్యమం సెల్ ఫోన్ వచ్చేసింది. ఇది మరింత ఆధునికత పొందుపరుచుకుని స్మార్ట్ ఫోన్ అయ్యింది. ఇందులో సోషల్ మీడియా యాప్‌లు ఉండనే ఉన్నాయి. బోరు కట్టినప్పుడల్లా స్మార్ట్ ఫోన్ తీయడం, ఒక వేలితోనే సోషల్ మీడియాను జల్లెడ పట్టేస్తుండం చేస్తుంటాం. అందులో న్యూస్ నుండి న్యూసెన్స్ వరకు ప్రతిదీ చూస్తాం. ఎవరికీ దేనిమీద ఆసక్తి ఉంటుందో వాటి గురించి సమాచారాన్ని ఎక్కువగా తెలుసుకుంటారు. నేటి యువతలో ఎక్కువ మంది క్రీడలు లేదా సినిమా అంశాల మీద దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నటీనటుల చిన్నప్పటి ఫోటోలు, త్రోబ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లకు వాటిపైనే ఆసక్తి అంతా. తాజాగా తన చిన్ననాటి ఫోటోలను పంచుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిందీ ప్రముఖ నటి.
ఈ ఫోటోలో ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తున్నారు కదా. వారిలో ఒకరు ప్రముఖ నటి కూడా ఉన్నారు. ఓ బబ్లీ గాళ్ పక్కన క్యూట్ లుక్స్‌తో, అల్లరి చేస్తూ కనిపిస్తున్నఈ చిన్నది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇంతకూ ఆ నటి ఎవరునుకున్నారు. జాతీయ ఉత్తమ నటి, మన మహా నటి కీర్తి సురేష్. తన అక్క రేవతి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా కీర్తి సురేష్ పంచుకుంది. అందులో అక్కతో కలిసి అల్లరి పనులు చేసినవి, చిలిపి సంఘటనలకు సంబంధించిన ఫోటోలున్నాయి. అక్క రేవతి కూడా విఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్. షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ లో పనిచేశారు.
‘అక్కా, మీ పుట్టినరోజు సందర్భంగా నా గ్యాలరీ నుండి అందమైన జ్ఞాపకాల ద్వారా ప్రేమతో కూడిన శుభాకాంక్షలు పంపుతున్నాను, ఈ మీ సంవత్సరం మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా ఉండనివ్వండి’అంటూ ట్వీట్ చేశారు కీర్తి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. కీర్తి సురేష్ ప్రముఖ నటి మేనక కుమార్తె. నేను శైలజతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది. తమిళ, మలయాళ సినిమాల్లో నటిచింది. మహా నటితో దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత అజ్ఞాతవాసి, రంగ్ దే, సర్కారు వారి పాట వంటి సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం నాని సరసన దసరా సినిమాతో రాబోతుంది. పలు సినిమాలు చేస్తోంది. ఆమె సినిమాల్లో మీకు ఏదీ ఇష్టమో మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి.