తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తన అందం, అభినయంతో ఎనలేని ప్రేక్షకులను సంపాదించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. హాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ వరుస ఈ సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ మెల్ల మెల్లగా తన గ్రాఫ్ ను పెంచుకుంటూ అగ్ర హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళిపోయింది. ఇక తమన్నా పాత్రలతో సంబంధం లేకుండా అంది వచ్చిన అవకాశాలన్నీ లాగేసుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది.
బాహుబలి సినిమా నుంచి చిన్నా చితక సినిమాల్లో నటిస్తూ పాత్రకు న్యాయం చేస్తుంది. తన టాలెంట్ ను చూపిస్తో వరుస అవకాశాలను అందుకుంటోంది ఈ తెల్లతోలు సుందరి. ఇక గతంలో తమన్నా స్పెషల్ సాంగ్ లో ఆడిపాడిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా మరో మెగా హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. టాప్ హీరోలతో కలిసి తన డ్యాన్స్ తో పోటీపడే తమన్నా.. స్పెషల్ సాంగ్ లో మెగా హీరో వరుణ్ తో స్టెప్పులేయనుంది. ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ కోసం గని సినిమాలో ప్రత్యేక గీతం చేయనుంది.
ఇక దీని కోసం చిత్ర యూనిట్ ఆమెను స్పందించటంతో దానికి ఓకే చేప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తుండగా వరుణ్ తేజ్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోంది. ఇక దీంతో పాటు ప్రస్తుతం తమన్నా ఎప్3, మ్యాస్ట్రో వంటి సినిమాలతో బిజీగా ఉంది.