చిత్రపరిశ్రమలో హీరోయిన్లకు మూడు పదుల వయస్సు దాటిందంటే చాలు.. ఎప్పుడెప్పుడు పెళ్లి వార్త వినిపిస్తుందా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. కొన్నేళ్లుగా పెళ్లి విషయంలో స్టార్ హీరోయిన్స్ అసలు స్పందించట్లేదు. అందులోనూ చేతిలో సినిమాలు ఉన్నాయంటే అసలు పెళ్లి ఊసే ఎత్తడం లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం అందరు హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకొని సినిమాలు కూడా చేస్తున్నారని అంటున్నారు.
పెళ్లి విషయంలో తమ అభిమాన హీరోయిన్ ఇంకెప్పుడు తీపికబురు చెబుతుందోనని వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్నా. కొద్దిరోజులుగా తమన్నా పెళ్లి అంటూ.. కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం ఓకే చేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. తమన్నా స్పందించకపోయేసరికి నిజంగానే చేసుకోబోతుందేమో అని భావించారు ఫ్యాన్స్. కానీ తాజాగా తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నింటికీ చెక్ పెట్టేసినట్లు తెలుస్తుంది.నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా? అని అడిగిన ప్రశ్నకు తమన్నా స్పందిస్తూ.. ‘పెళ్లి తప్పకుండా చేసుకుంటాను. కానీ ఇప్పుడే కాదు. నా పెళ్లిని చూడాలంటే మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం నా పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ రూమర్లు. అవన్నీ నమ్మకండి” అంటూ కొట్టిపారేసింది అమ్మడు. ఇక కెరీర్ పరంగా తమన్నా.. తెలుగులో మెగాస్టార్ తో భోళాశంకర్, సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం, ఎఫ్3 సినిమాలు చేస్తోంది. అలాగే అడపాదడపా స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడుతోంది. మరి అందాలరాశి తమన్నా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.