సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఎన్నేళ్లు గడిచినా అదే నాజూకుదనంతో, రోజురోజుకూ రెట్టింపు అందంతో మెరుస్తుంటారు. వారి అందం చూసి ఓవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంటే.. మరోవైపు అసలు ఇన్నేళ్ల నుండి ఎలా ఇంత అందాన్ని మెయింటైన్ చేస్తోందని ఆశ్చర్యపోతున్నారు. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్ళు గడిచినా అదే రెట్టింపు అందంతో ఆకట్టుకుంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా.
ఈ మధ్యకాలంలో తమన్నా సినిమా వార్తలకంటే ఎక్కువగా ఫోటోషూట్స్, వర్కౌట్ వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ అందం తరుగుతుందని అంటుంటారు. కానీ తమన్నా విషయంలో ఇదంతా రివర్స్ అవుతోంది. కెరీర్ ప్రారంభం నుండి అంతే ఫిట్నెస్ తో, అంతే హాట్ నెస్ తో కుర్రకారును ఫిదా చేస్తోంది ఈ భామ. అసలే అమ్మడి మేనిఛాయ తెలుపు.. అందులోనూ ఆకర్షించే ఒంపు సొంపులు ఉండేసరికి తమన్నా అందం చూసి నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు.
ఇక త్వరలో తమన్నా ‘F3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో అదిరిపోయే డ్రెసింగ్ స్టైల్ తో అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నా లేటెస్ట్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కుంకుమ రంగు టైట్ ఫిట్ డ్రెస్ లో ఓవైపు నడుము, మరోవైపు బ్యాక్ చూపుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. తమన్నా అందాల ట్రీట్ చూసి ఫ్యాన్స్ అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి తమన్నా లేటెస్ట్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.