బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో తన రిలేషన్‌షిప్‌పై హీరోయిన్ తమన్నా క్లారిటీ ఇచ్చారు. తమ బంధం ఎలా మొదలైందో ఆమె చెప్పుకొచ్చారు.
మిల్కీ బ్యూటీ తమన్నాకు సౌత్‌లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ఇంకా టాప్ హీరోయన్లలో ఒకరికగా కొనసాగుతున్నారు. తమన్నా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసినా, స్పెషల్ సాంగ్‌లో కనిపించినా ప్రేక్షకుల నుంచి అంతే స్థాయిలో రెస్పాన్స్ లభిస్తుంది. అందం, అభినయం, డ్యాన్సులతో ఆడియెన్స్‌లో ఆమె తనదైన ముద్ర వేశారు. ఈమధ్య బాలీవుడ్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న తమన్నా.. అక్కడ పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. ఇక, బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో ఈ మిల్కీ బ్యూటీ రిలేషన్లో ఉన్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీటిపై ఒక ఇంటర్వ్యూలో ఆమె క్లారిటీ ఇచ్చారు. విజయ్‌తో తాను రిలేషన్లో ఉన్నది వాస్తవమేనని తమన్నా తెలిపారు.
‘విజయ్ వర్మతో నేను అంత క్లోజ్‌గా ఉంటున్నానంటే దానికి కారణం అతడు నా సహనటుడనే కాదు.. మా ఇరువురి మధ్య మంచి బంధం ఉంది. ఎవరినైనా లవ్ చేయాలంటే వారితో ఉంటే మనం హ్యాపీగా ఉండగలమనే భావన కలగాలి. విజయ్‌తో ఉంటే నాకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఇప్పటిదాకా నేను ఎంతోమంది హీరోలతో కలసి యాక్ట్ చేశా. వాళ్లందరి కంటే విజయ్ స్పెషల్. అతడు నన్ను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది. కష్టం వస్తే నాకు తోడుగా ఉంటాడనే విశ్వాసం ఉంది. ఫిలిం ఇండస్ట్రీలో మనం ఎదుగుతున్నామంటే కిందకు లాగేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ విజయ్ అలాంటి వారి నుంచి నన్ను రక్షిస్తాడు. నా విషయంలో అతడు ఎంతో కేర్ తీసుకుంటాడు. విజయ్ వర్మ ఎక్కడ ఉంటే అక్కడే నా సంతోషం’ అని తమన్నా చెప్పుకొచ్చారు. ‘లస్ట్ స్టోరీస్ 2’ సెట్స్‌లోనే తమ ఇద్దరి మధ్య బంధం మొదలైందని ఆమె తెలిపారు.