తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి ఎంతోమంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొంతమంది హీరోయిన్లు మంచి సక్సెస్ అందుకొని టాప్ హీరోయిన్లుగా చలామణి అయ్యారు. కొందమంది హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యారు. అలాంటి నటీమణుల్లో ఒకరు తాప్సీ.
తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది మంచి సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం గ్లామర్ కే పరిమితం అయి కనుమరుగైపోయారు. 2010లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్, తాప్సీ పొన్ను జంటగా తెరకెక్కించిన చిత్రం ‘ఝుమ్మందినాదం’. ఈ మూవీలో తాప్సీ తన అందాలతో కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది. ఈ చిత్రం హిట్ తర్వాత తాప్సీకి మరికొన్ని చిత్రాల్లో ఛాన్సు వచ్చినా పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. దీంతో బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ మంచి సక్సెస్ సాధించింది. తాప్సీ అప్పడప్పుడు సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా మరోసారి తనకు సౌత్ ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే..
ఝుమ్మందినాదం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించింది తాప్సీ పొన్ను. నటనకు పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు రావడం.. ఎక్కువగా గ్లామర్ షోకే పరిమితం అయ్యింది. దీంతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించలేకపోయింది. అదే సమయంలో బాలీవుడ్ కి పయణం అయ్యింది. అక్కడ మంచి హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది తాప్సీ. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెయ్యడం అన్న సామెతలా.. హీరోయిన్ గా మంచి అవకాశం ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని టార్గెట్ చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో తీవ్ర విమర్శల పాలయ్యింది. తాజాగా మరోసారి సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్ నుంచి తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన ఈ అమ్మడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే యూటర్న్ తీసుకుంది. సౌత్ ఇండస్ట్రీలో నటించిన చిత్రాల వల్ల తనకు ఎలాంటి స్టార్డమ్ రాలేదని.. నటిగా సంతృప్తి దొరకలేదని సంచలన కామెంట్స్ చేసింది. అందుకే తాను బాలీవుడ్ పై దృష్టి పెట్టానని.. ‘పింక్’ చిత్రం తర్వాత తన జీవితం గొప్ప మలుపు తిరిగిందని వెల్లడించింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ చేస్తూ చాలా సంతృప్తిగా ఉన్నానని తెలిపింది. తాను చేస్తున్న క్యారెక్టర్స్ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవాలని.. తన స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదన్న స్థాయికి చేరుకోవడమే తన లక్ష్యం అని పేర్కొంది. తాప్సీ చేసిన వ్యాఖ్యలపై సౌత్ ప్రేక్షకులు మరోసారి మండిపడుతున్నారు.