సాధారణంగా సినిమాలు చేసి సోషల్ మీడియా క్రేజ్ సంపాదించుకునే వాళ్ళను మనం చూస్తుంటాం. కానీ ఈ మధ్యకాలంలో వైరల్ వీడియోల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంటున్న సోషల్ మీడియా స్టార్స్ ని చూస్తున్నాం. అలా ఒక్క సినిమా కూడా చేయకుండానే మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది సుప్రీత నాయుడు. ఈమె గురించి నెటిజన్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురుగా సుప్రీత అందరికి సుపరిచితమే.
ఇప్పటివరకు సుప్రీత సినిమాలు చేయలేదు కానీ సోషల్ మీడియా ఫాలోయింగ్ లో తల్లినే మించిపోయింది. ఈ మధ్యే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లో కనిపించి సందడి చేసిన సుప్రీత.. త్వరలోనే ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాతో టాలీవుడ్ లో నటిగా డెబ్యూ చేయబోతుంది. సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో.. కొత్త కొత్త ఫోటోషూట్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది.
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియా స్టార్ అయినటువంటి సుప్రీత.. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో చిట్ చాట్ లో పాల్గొంటుంది. తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ లో పాల్గొన్న సుప్రీత.. తన స్నేహితురాలు డాలీని తలచుకొని ఎమోషనల్ అయ్యింది. నీ ఫ్రెండ్ డాలీని మిస్ అవుతున్నావా? అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. అవును చాలా మిస్ అవుతున్నాను. 2 నెలలు గడిచినా రెండేళ్లు గడిచిన ఫీలింగ్ కలుగుతుందని ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సుప్రీత ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి సుప్రీత పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.