టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ల పర్సనల్ అప్‌డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటారు. ఫోటోషూట్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ నానా హంగామా చేస్తుంటారు.
సోషల్ మీడియాలో సెలబ్రిటీ కిడ్స్‌కి ఉండే క్రేజే వేరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా స్టార్ కిడ్ అనే ఒకే ఒక్క కారణంతో మిలియన్ల కొద్దీ నెటిజన్స్ వాళ్లని ఫాలో అవుతుంటారు. వాళ్లు షేర్ చేసే పిక్స్, రీల్స్ వంటి వాటికి భారీగా లైక్స్, వ్యూస్ వస్తుంటాయి. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ల పర్సనల్ అప్‌డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటారు. ఫోటోషూట్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ నానా హంగామా చేస్తుంటారు. అలాగే నెటిజన్స్ ఎవరైనా వల్గర్ కామెంట్స్ చేస్తే ఫైర్ అవుతుంటారు కూడా. చాలా సార్లు సుప్రీత డ్యాన్స్ వీడియోస్ నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పుడు షేర్ చేసిన ఓ వీడియో కుర్రకారుని తెగ ఆకట్టుకుంటుంది.
ఇందులో పెద్దగా డ్యాన్స్ చెయ్యకపోయినా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కళ్లు తిప్పనివ్వకుండా చేసేసింది సుప్రీత. ఇంతకీ తను చేసిన రీసెంట్ సాంగ్ ఏంటో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మీరా చోప్రా జంటగా నటించిన ‘బంగారం’ మూవీలో సాంగ్. బాలీవుడ్ భామ, ఐటెమ్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన రచన మౌర్య ఇందులో స్పెషల్ సాంగ్ చేసింది. పల్లవికి ముందు ‘తాడు బొంగరం, తళా తళా ఉంగరం’ అంటూ కొన్ని పదాలు వస్తాయి. వాటికి తన స్టైల్లో మూమెంట్స్ చేసింది సుప్రీత. బండారు సుప్రీత నాయుడుని ఇన్‌స్టాగ్రామ్‌లో 631K మంది ఫాలో చేస్తున్నారు.
ఇక సురేఖా వాణి, సుప్రీత పార్టీలకు వెళ్లడం, విదేశాల్లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసిన పిక్స్, వీడియోస్ నెట్టింట రచ్చ లేపుతుంటాయి. నెటిజన్లలో వారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సురేఖ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి క్యారెక్టర్ యాక్ట్రెస్‌గా స్టార్ స్టేటస్ దక్కించుకుంది. అయితే ఆమెలానే సుప్రీత కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. త్వరలో తెరంగేట్రం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు జనాలు.