డ్రగ్స్ వివాదం తెలుగు ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపేసింది. వారిలో టాలీవుడ్, కోలీవుడ్ సినీ నటులు, రాజకీయ, వ్యాపారవర్గాలకు చెందిన బడా బాబుల పేర్లు ఉన్నట్లు నిర్ధారించారు. అయితే తాజాగా నటి సురేఖ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.
డ్రగ్స్ వివాదం తెలుగు ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపేసింది.టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొకైన్ రవాణా చేస్తుండగా జూన్ 14న కబాలి నిర్మాత కేపీచౌదరిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పరిచయాలున్న పలువురి పేర్లు బయటకు రావడం ఇప్పుడు సంచలనం రేపింది. దీని ప్రకారం ఈ లిస్టులో ఇద్దరు యువ నటుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే వారెవరన్నది పోలీసులు బయటపెట్టడం లేదు.నిందితుడు కేపీ చౌదరి ఫోన్లలో వందల ఫొటోలు, సెల్ నంబర్లను పోలీసులు గుర్తించారు. వారిలో టాలీవుడ్, కోలీవుడ్ సినీ నటులు, రాజకీయ, వ్యాపారవర్గాలకు చెందిన బడా బాబుల పేర్లు ఉన్నట్లు నిర్ధారించారు. అయితే తాజాగా నటి సురేఖ వాణి తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు.
నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది సురేఖ. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఈమెకు మంచి గుర్తింపే లభించింది. ఏజ్ పెరుగుతున్న తన గ్లామర్ తో ఈ మధ్య సోషల్ మీడియాలో ఈమె బాగా వైరల్ అయింది. డ్రగ్స్ కేసులో రోజుకొక సంచలన నిజాలు బయటపడుతుండడంతో సురేఖ వాణిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి.ఇటీవలే సురేఖ వానితో పాటు తన కూతురు సుప్రీతా కేపీ చౌదరీతో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఒక పార్టీలో సురేఖ తనకు ముద్దు పెడుతున్న ఫోటో వైరల్ కాగా.. తన కూతురు కూడా అతనితో ఉన్న ఫోటో కేపీ చౌదరీకి దగ్గరగా ఉంది. దీంతో తల్లి, కూతురు ఇద్దరికీ కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది.తాజాగా ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ “నాపై డ్రగ్స్ ఆరోపణలు వస్తున్నాయనడంలో ఎలాంటి అర్ధం లేదు. దయ చేసి ఇలాంటి ఆరోపణలు సృష్టించవద్దు. మీరు సృష్టించే ఈ న్యూస్ వలన భవిష్యత్తులో మా కెరీర్, మా పిల్లల కెరీర్ మా ఫ్యామిలీ అంత బాధపడాల్సి వస్తుంది. మానసికంగా కూడా మేము చాలా బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి వార్తలను దయచేసి వ్యాప్తి చేయొద్దు” అని సోషల్ మీడియా వేదికగా సురేఖ తెలియజేసింది.