సురేఖా వాణి గత కొంత కాలంగా సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అయ్యింది. తన కూతురు సుప్రితతో కలిసి నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఇక తాజాగా వైఎస్ షర్మిలను ట్రోల్ చేస్తూ.. రీల్ చేసింది సురేఖా వాణి. ఆ వివరాలు..
నటి సురేఖా వాణి.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏళ్లుగా టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. సినిమాలో అమ్మ, అత్త, అక్క, వదిన ఇలా హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తు.. మంచి పేరు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. కుమార్తెతో కలిసి.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. ఎప్పుడు సినిమా పాటలు, డైలాగ్స్‌కు రీల్స్ చేసి, వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే సురేఖా వాణి.. గత కొన్ని రోజులుగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డైలాగ్స్ మీద రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో ఒక సారి ఇలాంటి ప్రయోగమే చేయగా.. తాజాగా మరోసారి షర్మిల అన్న మాటలతోనే రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సురేఖా వాణి. అయితే దాన్ని చూసిన వారు మాత్రం ఇది రీల్ కాదు ట్రోల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు..
వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా ముందుకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం మీద ఘాటుగా విమర్శలు చేస్తూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో షర్మిల మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా.. ‘‘పాదయాత్ర అంటే ఏంటి’’,‘‘’స్టూడెంట్స్ అని ఎందుకు అంటారు’’, ‘‘ఆడపిల్ల అంటే ఏంటి’’, ‘‘మీ ఆవిడా అని ఎందుకంటారు’’.. అనే డైలాగ్స్, వీడియోలు అయితే ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాయి.
ఇక కొన్ని రోజులుగా సురేఖా వాణి షర్మిల డైలాగ్స్ మీద రీల్స్ చేస్తోంది. ఇక తాజాగా స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నామంటే.. వాళ్లు యువత కాబట్టి అన్న షర్మిల మాటలను ట్రోల్ చేస్తూ.. ‘‘నీకు దండం పెడతా నేను.. నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అయితే అంతనే మాట్లాడు రాధిక.. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ ఏంగ్జయిటీ వస్తుంది నాకు.. నువ్వు మాట్లాడుతుంటే’’ అంటూ డేజే టిల్లు సినిమాలో చెప్పిన డైలాగ్‌తో రీల్ చేసింది సురేఖావాణి. దాన్ని ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతుంది.
సురేఖావాణి పోస్ట్ చేసిన రీల్ చూసిన చాలా మంది నెటిజనులు.. సూపర్ అంటూ లైకులు కొట్టారు. అయితే కొంతమంది మాత్రం.. ‘‘మేడమ్ మీరు వైఎస్ షర్మిలను అవమానిస్తున్నారు, షర్మిలక్కను ట్రోల్ చేస్తున్నారు” అంటూ కామెంట్లు పెట్టారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.