టాలీవుడ్ డ్రగ్స్ కేసు పెద్ద అలజడి రేపుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి నుంచి పోలీసులు విలువైన సమాచారాన్ని రాబట్టారని తెలుస్తోంది. ఈ కేసులో ప్రముఖ సినీ నటి సురేఖా వాణి పేరు కూడా వినిపిస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసులో పెను దుమారం రేపుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ‘కబాలి’ ప్రొడ్యూసర్ కేపీ చౌదరి ఇన్వెస్టిగేషన్లో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. కోర్టు పర్మిషన్తో నిందితుడ్ని రెండ్రోజులు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడ్ని లోతుగా ప్రశ్నించారని తెలుస్తోంది. కేపీ చౌదరి ఫోన్ కాల్ డేటాను చూసి పోలీసులు విస్తుపోయారని సమాచారం. అతడి ఫోన్లో పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు పొలిటీషియన్స్ కుమారుల నంబర్లు, ఫొటోలు ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే వారందరికీ అతడు డ్రగ్స్ విక్రయించాడా? అనే కోణంలో విచారణ సాగుతోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అషుకు కేపీ చౌదరి వందల సార్లు కాల్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వార్తల్ని ఆమె ఖండించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని, కొన్ని మీడియా వర్గాలు చెబుతున్న దాంట్లో నిజం లేదని అషురెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఈ డ్రగ్స్ కేసు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి టైమ్‌లో ఈ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరితో టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖావాణితో పాటు ఆమె కూతురు సుప్రీత దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఈవెంట్లో కేపీ చౌదరికి సురేఖ ముద్దులు పెడుతున్న ఫొటో వైరల్ అవుతోంది. మరో ఫొటోటో సుప్రీత కూడా కేపీ చౌదరికి దగ్గరగా ఉంది. దీంతో ఈ డ్రగ్స్ వ్యవహారంతో తల్లీకూతుళ్లకు లింక్ ఉందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కేపీ చౌదరితో సురేఖకు, ఆమె కూతురికి ఉన్న రిలేషన్ ఏంటనేది మిస్టరీగా ఉంది. అతడితో ఫొటోలు దిగినంత మాత్రాన వాళ్లు కూడా తప్పు చేశారని ఎలా చెబుతారని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రూమర్స్‌పై సురేఖావాణి క్లారిటీ ఇస్తే గానీ అసలు విషయం తెలియదు.