టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖా వాణి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల సురేఖ వాణి ఎక్కువగా తన కూతురుతో కలిసి సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నటీమణులు తమదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకన్న నటి సురేఖా వాణి. అమ్మ,అక్క, వొదిన పాత్రల్లో నటించి మెప్పించింది సురేఖా వాణి. గత కొంత కాలంగా సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. తన కూతురు సుప్రితతో కలిసి నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. తల్లీ కూతుళ్ల గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తుందటారు. తాజాగా సురేఖా వాణి భర్తను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
తెలుగు ప్రేక్షకులకు సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఈమె సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులారిటీ సంపాదించింది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ల సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన సురేఖా వాణీ.. దర్శకుడు సురేష్ తేజ ని వివాహం చేసుకుంది. భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్లామ్స్ కార్యక్రమానికి యాంకర్ గా బాగా పేరు సంపాదించింది. 2005 సంవత్సరంలో శీనుగాడు చిత్రంతో సినీ కెరీర్ ఆరంభించింది. అమ్మ, అక్క, వదిన పాత్రల్లో నటించి మెప్పించింది. ఇటీవల సురేఖా వాణీ భర్త సురేష్ తేజ అనారోగ్య కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే. తన భర్తతో గడిపిన చివరి క్షణాలను తెలియజేస్తూ ఎన్నోసార్లు కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు సురేఖా వాణీ. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా భర్తను తల్చుకొని ఎమోషనల్ పోస్ట్ ఇన్ స్ట్రాలో షేర్ చేసింది సురేఖా వాణీ.
‘నా కళ్లలో ఆనందం, సంతోషం కన్నా.. నువు నా పక్కన లేవు అన్న బాధ నన్ను ఎక్కువగా ఆవేదనకు గురి చేస్తుంది.. కానీ నీ ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ నాతోటే ఉంటాయని నాకు తెలుసు.. నా ప్రతి పుట్టిన రోజుకి నువ్వు చేసే సందడి.. ఆ మధుర క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.నిన్న చాలా మిస్ అవుతున్నా.. లవ్ యూ ఫర్ ఎవర్’ అంటూ ఎంతో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. కాగా, సురేఖా వాణీ బుల్లితెరపై కెరీర్ ఆరంభించిన తర్వాత సురేష్ తేజ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. 2019 లో అనారోగ్యంతో ఆయన కన్నుమూశాడు. నెట్టింట ఎప్పుడూ సందడి చేస్తూ ఉండే సురేఖ వాణీ ఎమోషనల్ పోస్ట్ చూసి నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.