సూపర్ స్టార్ కృష్ణ.. స్పెషల్ ఏవీ అవసరం లేనటువంటి వెండితెర రారాజు. నిర్మాతల పాలిట మారాజు. ఈయన సినిమా హిట్ అయితే నిర్మాతలకి, ఇండస్ట్రీకి కాసుల పంట. ప్లాప్ అయినా కూడా నిర్మాతలకొచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే సినిమా పోతే తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి ఇచ్చే దమ్మున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఈ క్వాలిటీసే కృష్ణ గారిని సూపర్ స్టార్ గా నిలబెట్టాయి. వీటినే మహేష్ బాబు దిగుమతి చేసుకుని సూపర్ స్టార్ అయ్యారు. ఇక ఘట్టమనేని కాంపౌండ్ నుండి వచ్చిన సుధీర్ బాబు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. వెరైటీ స్క్రిప్ట్స్ తో కృష్ణ గారిలా ప్రయోగాలు చేస్తుంటారు. సుధీర్ బాబు ఎంచుకునే సినిమాల టైటిల్స్ కూడా చాలా భిన్నంగా ఉంటాయి.
ఆడు మగాడ్రా బుజ్జి, శమంతకమణి, భలే మంచి రోజు, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే, శ్రీదేవి సోడా సెంటర్, ఇవాళే రిలీజైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఇలా విభిన్నమైన టైటిల్స్ తో ఆకట్టుకోవడం సుధీర్ బాబు స్పెషాలిటీ. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. ప్రస్తుతం సుధీర్ బాబు, కృష్ణ కలిసున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ స్ప్రెడ్ అవుతోంది. ఈ ఫోటోలో తెల్ల చొక్కాలో కృష్ణ గారు.. డైనింగ్ టేబుల్ వద్ద లంచ్ చేస్తున్నారు. ఆయనకు ఎడమ పక్కన సుధీర్ బాబు కుర్చీలో కూర్చొని కృష్ణ గారినే తదేకంగా చూస్తున్నారు.
కృష్ణ గారు తింటుంటే.. సుధీర్ బాబు తన కడుపు నిండినంత హ్యాపీ ఫీలవుతున్నారు. ఫోటో చూస్తుంటే స్వయంగా తానే కృష్ణ గారికి వడ్డించినట్లు ఉంది. అయితే ఈ ఫోటోలో సుధీర్ బాబు చాలా సింపుల్ గా కనబడుతున్నారు. సుధీర్ బాబు ఇంట్లో ఇంత సింపుల్ గా ఉంటారా అని ఆశ్చర్యం వేస్తుంది. ఏది ఏమైనా మావయ్యతో సుధీర్ బాబు ఉన్న దృశ్యం అభిమానులను ఆకర్షిస్తోంది. మరి ఈ అరుదైన దృశ్యంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.