విష్ణుప్రియ అనగానే నెటిజన్స్ కి ఫస్ట్ గుర్తొచ్చేవి ఆమె ఇన్ స్టా ప్రొఫైల్. పేరుకే యాంకర్ కానీ ఫొటోలు చూస్తే మతిపోతుంది. ఫుల్ గ్లామర్ షో. మీరు చూసినా సరే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఒక్కో ఫొటో చూస్తుంటే.. హీటెక్కిపోవడం గ్యారంటీ. అలాంటి విష్ణుప్రియ ఈ మధ్య ఓ ఆల్బమ్ సాంగ్ తోనూ రచ్చ లేపింది. యూట్యూబ్ లో ఆ సాంగ్ వ్యూస్ మిలియన్స్ లో ఉన్నాయి. ఇంకా పెరుగుతున్నాయి కూడా. అలాంటి విష్ణుప్రియ.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తే, కోరిక తీరుస్తావా అని కమిట్మెంట్ అడిగారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. యాంకర్ విష్ణుప్రియని టీవీ, సోషల్ మీడియా యూజర్స్ టక్కున గుర్తుపట్టేస్తారు. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి, ‘పోరాపోవే’ షోతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. సుడిగాలి సుధీర్ తో కలిసి కొన్నాళ్లపాటు ప్రేక్షకుల్ని తెగ ఎంటర్ టైన్ చేసింది. వీళ్ల జోడీ గురించి అప్పట్లో ఒకటే టాక్. కానీ ఆ తర్వాత సుధీర్-విష్ణుప్రియ కలిసి షోలు చేయడం మానేశారు. ఇక విష్ణుప్రియ హైట్ కంటే ముక్కుపైనే ఎక్కువగా కామెంట్స్ వినిపించేవి. వాటికి హర్ట్ అయినా సరే పెద్దగా పట్టించుకునేది కాదు.
యాంకర్ స్పెషల్ ఈవెంట్స్ కూడా చేసి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ.. ప్రస్తుతం ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ బిజీ అయిపోయింది. ఈ మధ్య విష్ణుప్రియ నటించిన ‘వాంటెడ్ పండుగాడ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. ఈ చిత్రంలో అందాల ప్రదర్శన చేసినా సరే విష్ణుప్రియకు నిరాశ కలిసిరాలేదు. ఈ మధ్య ‘జరీ జరీ’ ఆల్బమ్ సాంగ్ తోనూ వచ్చిన ఈమె.. టాప్ టూ బాటమ్ అందాల విందు చేసింది. ఆ డ్యాన్స్ కి తోడు విష్ణుప్రియ గ్లామర్.. వీడియోని మళ్లీ మళ్లీ చూసేలా చేసింది.
ఇక ఈ సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న విష్ణుప్రియ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయిపోయింది. కాస్టింగ్ కౌచ్, కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే లేదని చెప్పింది. ప్రతి రంగంలోనూ మహిళలకు ఇబ్బందులు తప్పట్లేదని పేర్కొంది. తను కూడా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తే.. కోరిక తీరుస్తావా అని కమిట్మెంట్స్ అడిగారని తెలిపింది. వాటికి నో చెప్పి సదరు అవకాశాల్ని వదిలేసుకున్నానని అసలు విషయాన్ని రివీల్ చేసింది. మరి విష్ణుప్రియ షాకింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: అనసూయపై విష్ణుప్రియ సెటైర్స్! వీడియో డిలీట్!