ఆంటీ ఈ పదం కొన్ని రోజలు పాటు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అయ్యింది. ఆంటీ పదం మీద వచ్చినన్ని మీమ్స్ ఇక దేని మీద వచ్చి ఉండవు. టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ చుట్టూ ఈ ఆంటీ వివాదం నడిచింది. లైగర్ సినిమా విడుదల తర్వాత అనసూయ చేసిన ట్వీట్ కాస్త వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఆంటీ అంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో అనసూయ తనను ట్రోల్ చేస్తున్న ట్వీట్లను స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నానని, కేసులు పెడతానని హెచ్చరించింది. ‘‘నన్ను ఆంటీ అనడంతో పాటు ఏజ్ షేమింగ్ చేయడం, తిట్టడం చేస్తున్న ప్రతి ట్వీట్, వారి అకౌంట్‌ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. వారిందరిపై కేసులు పెడతా. ఇదే నా ఫైనల్ వార్నింగ్’’ అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికైతే ఈ వివాదం ముగిసింది.
ఈ క్రమంలో తాజాగా యాంకర్ విష్ణు ప్రియ ఆంటీ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసి.. ఆ తర్వాత నోరు కరుచుకుంది. షోలు, స్పెషల్ సాంగ్స్, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విష్ణు ప్రియ.. కొన్ని రోజుల క్రితం వాంటెడ్ పండుగాడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె మానస్‌తో కలిసి చేసిన జరి జరి పంచెకట్టు పాట సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ క్రమంలో తాజా విష్ణుప్రియ ఆర్జే కాజల్‌కు చెందిన ఓ షోలో పాల్గొంది. అందులో కాజల్.. ర్యాపిడ్ పైర్‌లో భాగంగా కొన్ని వివాదాస్పద ప్రశ్నలు అడిగింది. ఈ క్రమంలో ఆంటీ వివాదంపై కాజల్ ప్రశ్నలు సంధించడం.. దానికి విష్ణు ప్రియ ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.
ర్యాపిడ్ ఫైర్‌లో భాగాంగా కాజల్.. ఆంటీ అంటే ఫీలయ్యే ఆంటీ ఎవరు అని ప్రశించింది. దానికి విష్ణుప్రియ ఠక్కున సమాధానం చెప్పి.. ఆ వెంటనే నాలుక్కర్చుకుంది. కాజల్ అడిగిన ప్రశ్నకు.. విష్ణు ప్రియ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘ఆంటీ అంటే ఫీలయ్యే ఆంటీ.. అనసూయ’ అని సమాధానం చెప్పింది. వెంటనే ‘ఆంటీ’ వివాదం గుర్తుకొచ్చి నాలుక కరుచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఒరిజనల్ వీడియో నుంచి ఈ బిట్ కట్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈలోపే వీడియో వైరలయ్యింది ఇది చూసిన నెటిజనులు.. ఇప్పుడు అనసూయ.. ప్రశ్న అడిగిన కాజల్.. ఆన్సర్ చెప్పిన విష్ణు ప్రియ మీద కూడా కేసు పెడుతుందా ఏంటి అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) September 15, 2022