దేవత.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ సీరియల్ గురింతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీరియల్‌లో హీరోయిన్ చెల్లిగా చేసిన వైష్ణవి అందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత ఆమె ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత నుంచి వాహ్ వైష్ణవి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్‌లో ఉంటోంది. ఆమె లైఫ్ జరిగిన ప్రతి విషయాన్ని వ్లాగ్ ద్వారా ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవలే ఆమె కరీనగర్‌కు చెందిన సీరియల్ డైరెక్టర్ సురేష్ కుమార్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
అయితే చాలా రోజుల నుంచి వైష్ణవి తన యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. చాలా గ్యాప్ తర్వాత శుక్రవారం ఒక కొత్త వీడియోతో వైష్ణవి ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. అది కూడా ఒక గొప్ప గుడ్ న్యూస్‌తో ప్రేక్షకులను పలకరించింది. అదేంటంటే.. ఆమె త్వరలోనే తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. వారి కుటుంబంలోకి కొత్త మెంబర్ రాబోతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా కాస్త ఆరోగ్యం కూడా బాలేదని, బాగా వాంతులు అవుతున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. మరి.. వైష్ణవి- సురేష్ దంపతులకు కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలు తెలియజేయండి.