బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండోవారం కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకోనుంది. తొలివారం కెప్టెన్ బాలాదిత్య టర్మ్ దాదాపు పూర్తి కావొచ్చింది. కెప్టన్సీ టాస్క్ లో రెండో వారం కెప్టెన్‌గా రాజ్ ఎంపికయ్యాడు. అసలు ఎవరు ఆ రాజ్ అనే స్థాయి నుంచి మనోడు హౌస్ కెప్టెన్‌గా ఎదిగాడు. వారంరోజుల్లోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు హౌస్ మొత్తం కెప్టెన్ టాస్క్ తర్వాత గరం గరం అయిపోయింది. ముఖ్యంగా రేవంత్ చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు. మొదటి కెప్టెన్‌గా బాలాదిత్య ఎంతో సామరస్యంగా హౌస్‌ని నడుపుకొచ్చాడు. తాజాగా రేవంత్- బాలాదిత్య సహా పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
శ్రీహాన్‌తో మాట్లాడుతూ రేవంత్.. “ఇంట్లో ఫైమా ఏం పని చేస్తోంది చెప్పు. చంటి అన్న వాళ్లతో కూర్చొని నవ్వుకుంటూ, నవ్విస్తూ ఉండటం తప్ప ఆమె ఏం పని చేస్తోంది? మనం ఎంత పని చేసినా కూడా దానికి విలువ ఉండటం లేదు” అంటూ రేవంత్ చెప్పుకొచ్చాడు. అందుకు శ్రీహాన్ సైతం అవును ఆమె ఎప్పుడూ పని చేస్తున్నట్లు నేను కూడా చూడలేదు అంటూ సమాధానం చెప్పాడు. రేవంత్ ఒక్క ఫైమానే కాదు ఇంకా అలాంటి వాళ్లు చాలా మంది హౌస్‌లో ఉన్నారు అంటూ కామెంట్ చేశాడు. అయితే మరి అతని దృష్టిలో ఎవరు ఇంకా అలాంటి వారు అనేది దానిపై ఫుల్ ఎపిసోడ్‌లో క్లారిటీ రావచ్చేమో చూడాలి.
అయితే మరోవైపు ప్రోమోలో రేవంత్- బాలాదిత్యపై సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. కెప్టెన్ గా హౌస్‌లో డ్యూటీలు అలాట్ చేయాల్సిన బాధ్యత బాలాదిత్యపై ఉంది కాబట్టి.. రేవంత్‌కు టాయ్‌లెట్స్ డ్యూటీ మళ్లీ వేసినట్లు ఉన్నాడు. ఆ విషయంలో రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజానికి గతంలోనూ తనకు టాయ్‌లెట్స్ డ్యూటీ ఇష్టం లేదని రేవంత్ చెప్పడం చూశాం. మరోసారి ఆదిరెడ్డి- రేవంత్‌కు అదే డ్యూటీ రావడంతో రేవంత్ పైకి అనేశాడు. అంతేకాకుండా ఆదిరెడ్డితో మాట్లాడుతూ మనం కూడా కెప్టెన్ కాకపోతామా ఎవరికి అయితే ఈ డ్యూటీ ఇష్టంలేదంటారో వాళ్లకే ఈ డ్యూటీ వేస్తా అంటూ రేవంత్ చెప్పుకొచ్చాడు. రేవంత్- బాలాదిత్యపై ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.