అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. ఇక ఇందులో అల్లు అర్జున్ కు జోడిగా నటిస్తోంది రష్మిక మందన. దీంతో పాటు టాలీవుడ్ లో ప్రముఖులైన ప్రకాష్ రాజ్, సునీల్, జగపతి బాబు, అనసూయ వంటి నటులు నటించనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్, టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ ను చుసిన ప్రతి ఒక్కరు సినిమాపై అంచనాలు పెంచుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ తో పాటు మరిన్ని భాషల్లో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఇక విషయం ఏంటంటే.. సుకుమార్ సినిమా అంటే అందులో ఖచ్చితంగా ఐటెం సాంగ్ ఉండి తీరాల్సిందే. ఈ లెక్కల మాస్టర్ తెరకెక్కేంచే ప్రతీ మూవీలోనూ ఖచ్చితంగా ఐటెం సాంగ్ ఉండేందుకు ప్లాన్ చేసుకుంటాడు. ఇక అయన అనుకున్నట్టుగానే పుష్ప మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కు ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. మరి ఈ సాంగ్ లో ఏ హీరోయిన్ తీసుకోవాలో తెలియక తికమకలో ఉన్నాడట సుక్కు. మొదటగా ఈ సాంగ్ కోసం అనన్యపాండే, ఊర్వశీ రౌటెలాను చిత్ర బృందం సంప్రదించినట్లు సమాచారం. ఇక కొన్ని కారణాల వల్ల వాళ్ళను వద్దనుకున్నారట యూనిట్.
ఇక తాజాగా సమాచారం ప్రకారం బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక ఈ అందాల భామ ఏకంగా అరకోటికి పైగా డిమాండ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఒక పుష్ప సినిమాల్లో సన్నీలియోన్ గనుక మెరిస్తే ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరిన్ని పెరుగుతాయి. మరి ఈ భామ డిమాండ్ కు దర్శక, ఒప్పుకున్నారా? లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.