Sunny Leone Cooks Parata : వరుస ప్లాపులు పలకరిస్తున్నా సినిమాల విషయంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు కాంప్రమైజ్ కావటం లేదు. గ్యాపు రాకుండా ప్రతీ సంవత్సరం ఓ సినిమా చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈషాన్ సూర్య దర్శకత్వంలో ‘‘గాలి నాగేశ్వరరావు’’ అనే సినిమా చేస్తున్నారు. ఆయన సరసన పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతోంది. మంచు విష్ణు తన గత సినిమాలు ప్లాప్ అవ్వటానికి సరైన ప్రమోషన్ లేకపోవటమే కారణం అనుకున్నారో ఏమో తెలియదు కానీ, పది రోజులకో వీడియోతో సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. సన్నీలియోన్‌తో వీడియోలు చేస్తూ తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు.
తాజాగా, సన్నీ లియోన్ తన ఇంట్లో పరోటాలు చేసిన ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దాదాపు 9 నిమిషాలు ఉన్న ఆ వీడియోలో సన్నీ లియోన్‌తో కలిసి అల్లరి చేశారు. ఆమెకు ఓ తిట్టును కూడా నేర్పించారు. ఆమెతో ఆలూ పరోటాలు చేయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మీరు మా ప్రెసిడెంట్ కాదు.. సన్నీ లియోన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్’’ అంటూ మండిపడుతున్నారు. మరి, మంచు విష్ణు, సన్నీ లియోన్ ఫన్నీ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ‘‘జెర్సీ’’ సినిమాకు మూడేళ్లు.. ట్రెండింగ్‌లో డిలేటెడ్ వీడియో..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.