బుల్లితెర ఫేవరేట్ జోడి అంటే సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీ గౌతమ్ పేర్లు చెబుతుంటారు ప్రేక్షకులు. ఈ జోడి ఎక్కడ కనిపించినా ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది. అలాగే ఇద్దరి మధ్య రొమాంటిక్ సంభాషణలు, సుధీర్ ఫ్లర్ట్ చేయడం, రష్మీ ఛీ కొట్టడం లాంటివన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే.. మొన్నటివరకూ ఢీ డాన్స్ షోలో టీమ్ లీడర్స్ గా సుధీర్ – రష్మీ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఇటీవల ఇద్దరూ ఢీ షో నుండి వెళ్లిపోయేసరికి ఫ్యాన్స్ ఎంటర్టైన్ మెంట్ కోసం అల్లాడుతున్నారు. మళ్లీ సుధీర్, రష్మీల జోడిని ఎప్పుడు చూస్తామా.. అని ఎదురు చూస్తుండగా.. తాజాగా హోలీ ఫెస్టివల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. హోలీ ఫెస్టివల్ సందర్భంగా ‘తగ్గేదేలే’ అనే ప్రోగ్రాం కోసం సుధీర్ – రష్మీ మరోసారి జతకట్టారు. సుధీర్, రష్మీలకు సోషల్ మీడియాలో ఏ రేంజి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక హోలీ ప్రోమో చూసేసరికి మళ్లీ ఫ్యాన్స్ సందడి మొదలైంది. లేటెస్ట్ ప్రోమోలో సుధీర్ రష్మీ కోసం ఓ లవ్ సాంగ్ పాడాడు. ఆ పాట విని ఫిదా అయిన రష్మీ నోట మాట రాలేదు. అదే సమయంలో యాంకర్ రవి వచ్చి.. ‘నీ ఫోన్ లో సుధీర్ నెంబర్ ఏమని సేవ్ చేశావ్?’ అని రష్మీని అడిగేసరికి ఆమె సిగ్గు మొగ్గలేసింది. దీంతో సుధీర్ – రష్మీ మళ్లీ ఫామ్ లోకి వచ్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మార్చి 20న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి సుధీర్ – రష్మీ జోడి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.